Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అంతా ఉలిక్కి పడేలా చేసింది.. ఈ ఘటనతో అసలు ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రయాణికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయే విమర్శలు కూడా వచ్చాయి.. అయితే, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.. బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్‌సీ, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్‌టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఇలా.. క్షుణ్ణంగా…
జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం దుర్మార్గమని ఆయన ఎక్స్ (X)లో పోస్ట్ చేస్తూ విమర్శించారు.
TGSRTC : తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది.…
నేడు యూపీఐ చెల్లింపులు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఆన్‌లైన్ షాపింగ్ కు మాత్రమే కాకుండా.. చిన్న చిన్న కిరాణా సామన్లు కొనుగోలు చేసేందుకు కూడా ఈ చెల్లింపు విధానాన్ని ఉపయోగిస్తున్నాం. భారతదేశాన్ని ‘న్యూ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’గా మార్చడానికి ఇది చాలా ముఖ్యమైన సాధనం. ఇప్పటికే జనాలు ఈ యూపీఐ చెల్లింపు విధానానికి అలవాటు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్…
హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.
రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రవాణా శాఖ నూతన లోగోను, తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై సీఎం రేవంత్ రెడ్డి బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ ఆర్టీసీలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలకు సీఎం హాజరయ్యారు.
గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీనిర్వీర్యమైందని.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలో ఆర్టీసీని గాడిలో పెట్టినట్లు రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ, గవర్నర్ మొదట ఆమోదించలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో…