Ponnam Prabhakar: ఆర్టీసి మనందరిది దానిని కాపాడుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్ పాల్గొన్నారు.
TSRTC: ఈ సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు.
తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ఆర్టీసీలో ఉచితం చేసింది.. దాంతో మహిళా ప్రయాణికులు అంతా బస్సులకు వెళ్తున్నారు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళలు అధిక సంఖ్యలో ఉపయోగించు కుంటుండంతో.. తాజాగా మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద మహిళల సంఖ్య భారీగా తగ్గింది.. ఎక్కువ మంది లేటు అయినా పర్లేదు అలానే వెళ్తామంటున్నారు.. రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో…
ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ పై మహిళలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. పటాన్ చెరు నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్ లో మహిళలతో ముచ్చటించారు. ఫ్రీ టికెట్ పై మహిళల అభిప్రాయం తెలుసుకున్నారు జగ్గారెడ్డి. టికెట్ లేకుండా ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. టికెట్ లేని ప్రయాణం అంటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.…
సెక్రటేరియట్లో విద్యుత్, ఆర్టీసీపై సమీక్ష ముగిసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మరోవైపు.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. విద్యుత్, ఆర్టీసీ పై అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి రివ్యూ చేస్తానని సీఎం రేవంత్ రేవంత్ తెలిపారు.
టీఎస్ఆర్టీసీ కొత్త చైర్మన్గా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుమందు వరకు టీఎస్ ఆర్టీసీచైర్మన్గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. తాజాగా ఆయన స్థానంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. రెండు సంవత్సరాల పాటు ముత్తిరెడ్డి కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధ్యం అవుతుందా అని అనుకున్నాం... కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. దక్షత…
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడింది. గత గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో.. పలు అంశాలపై చర్చించారు. ఆదివారం అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ అధికారుల చెకింగ్ వాహనంలో చోరీ జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన టీఎస్ఆర్టీసీకి చెందిన చెకింగ్ అధికారులు వికారాబాద్ జిల్లాలోని తాండురులో నిన్న (శుక్రవారం) రాత్రి 9.30 గంటలకు డిపోలో చెకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చెకింగ్ అనంతరం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేసేందుకు డిపో పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లారు. అయితే, అధికారులు భోజనం చేసేందుకు వెళ్లడం చూసిన దుండగులు పార్కింగ్ చేసిన వాహనంలో నుంచి ఓ బ్యాగ్ ను…