మూడేళ్ళ తరువాత ఆర్టీసీలో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు అధికంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మె సైరన్ మోగింది. బస్సు డ్రైవర్ల సమ్మె కారణంగా శనివారం తెల్లవారుజాము నుంచే ఇతర ప్రాంతాలతో పాటు గ్రామాలకు వెళ్లే అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కరీంనగర్ కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80…
మెట్ట ప్రాంత ఆరోగ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రెండేళ్లుగా కరోనా కారణంగా ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది భారీగా భక్తులు వస్తారని ఉద్దేశంతో ముందస్తుగా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు .ముఖ్యంగా ఐదు రోజుల పాటు జరిగే వెంగమాంబ…
ఆర్టీసీ ఛార్జీలను 60 శాతం పెంచిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) వద్ద బీజేపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా.. బండి సంజయ్ అక్కడికి చేరుకుని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. జగిత్యాల వైపు వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో…
హైదరాబాద్ లో చాలామంది ఆఫీస్ లకు, స్కూల్స్, కాలేజ్, ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వెళ్లిన పని ఆలస్యమైతే బస్సులు ఉండవని కంగారు పడుతుంటారు. అయితే ఇక నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదని టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బస్సులు డిపోలకు…
మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ… ఇవాళ్టి నుంచి మేడారం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది ఆర్టీసీ… హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతీ రోజు అందుబాటులో ఉండనున్నాయి.. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.. ఇక, దీనికి చార్జీలను కూడా ఫిక్స్ చేసింది…
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు లేనట్లేనా? ముఖ్యమంత్రి హామీ పై ఉన్నతాధికారులు కసరత్తు చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వరం కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించదా? ఆర్టీసీ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ పై ఉద్యోగులు ఏమంటున్నారు?. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అంశం మరోసారి చర్చకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కార్పొరేషన్ల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. అప్పట్లోనే ఆర్టీసీ కూడా తన ఉద్యోగులకు దాన్ని వర్తింప…