ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న టీమిండియా కీపర్ సంజు శాంసన్.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)లోకి చేరాడు. అయితే కొత్త జట్టు సీఎస్‌కేతో ఆరంభం అతడికి కలిసి రాలేదు. తన మాజీ జట్టు రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సంజు కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆర్ఆర్ బౌలర్ నాంద్రే బర్గర్…
Ravindra Jadeja About To Play For Rajasthan Royals in IPL 2026: ఐపీఎల్ 2026లో జట్ల మార్పులు, కొత్త కాంబినేషన్లు క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున బరిలోకి దిగడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. సోమవారం గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఆర్ఆర్ తరఫున మొదటి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2026 ముందు ట్రేడ్…
రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ‘థంపింగ్ విక్టరీ’ని నమోదు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెన్నై బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ…
వైభవ్ మాత్రం సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అందరూ ధోనీకి షేక్ హ్యాండ్ ఇస్తాడనుకున్నారు. కానీ వైభవ్ ఆ పని చేయలేదు. ధోనీ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన వస్తున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ పోరులో చెన్నైకి 25 బంతుల్లో 54 పరుగులు అవసరమైనపుడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మహీ 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో చెన్నై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మరీ దిగువన వస్తుండడంపై…
భారత్‌లో తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు తాను చూస్తుంటా అని శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ తెలిపాడు. పుష్ప సినిమా బాగుందని, అప్పటి నుంచి తాను ఎక్కువగా తెలుగు చిత్రాలు వీక్షిస్తున్నానని చెప్పాడు. మైదానంలో పుష్ప తరహాలో సంబరాలు చేసుకోవడం బాగుందని హసరంగ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ శివమ్ దూబెను ఔట్ చేసిన…
ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విజయానికి 20వ ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా.. క్రీజ్‌లో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ తొలి బంతికే ధోనీని అవుట్ చేశాడు. ఆపై 13 పరుగులే చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్…
కాస్త లేట్ అయినా.. తన కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. మ్యాచ్‌లో తాము 20 పరుగులు తక్కువగా చేశామన్నాడు. చెన్నైకి ఏమాత్రం అవకాశం అవ్వకుండా.. తమ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. నితీశ్ రాణా బ్యాటింగ్‌లో ఇచ్చిన మెరుపు ఆరంభం చాలా కీలకంగా మారిందని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్…
పవర్ ప్లేలో అదనంగా పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఓపెనర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10×4, 5×6) అద్భుత బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ ఛేదించదగినదే అని, గౌహతి బ్యాటింగ్‌కు మంచి వికెట్ అని చెప్పాడు. మ్యాచ్‌లో ఓడినా తమకు సానుకూల అంశాలు ఉన్నాయని రుతురాజ్ పేర్కొన్నాడు. ఆదివారం గౌహతిలో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలుపొందింది.