Vaibhav Suryavanshi: చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. 33 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జైస్వాల్, సంజు శాంసన్, పరాగ్ రాణించడంతో రాజస్థాన్ విజయానికి బాటలు పడ్డాయి. అయితే ఈ మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ చేసిన పనిని ప్రతిఒక్కరు అప్రిసియేట్ చేస్తున్నారు. ఇది కదా సంస్కారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత సహచర ఆటగాళ్లు పెవిలియన్ వైపు వెళ్తుండగా.. వైభవ్ మాత్రం సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అందరూ ధోనీకి షేక్ హ్యాండ్ ఇస్తాడనుకున్నారు. కానీ వైభవ్ ఆ పని చేయలేదు. ధోనీ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.
Read Also: Vaibhav Suryavanshi: నేనేం ఏడవలేదు.. ఆ రోజు జరిగింది ఇదే..!
అయితే, ధోనీ వైభవ్ ని అలా చేయకు అంటూ పైకి లేపాడు. వైభవ్ ప్రదర్శనపై ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. చాలా బాగా అడావు వైభవ్ అంటూ మెచ్చుకున్నాడు. దీనికి సంబందించిన క్లిప్స్ సోషల్ మాధ్యమాలలో వైరల్ కావడంతో వైభవ్ మరోసారి నెటిజన్లను ఆకర్షించాడు. వైభవ్ చేసిన పనికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా సంస్కారం అంటూ వైభవ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సంజూ శాంసన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన వైభవ్ తొలి మ్యాచ్ తోనే ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో ఎదుర్కొన్న తొలిబంతినే సిక్సర్ బాదాడు. మూడో మ్యాచ్ లో భారీ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజాలని ఆశ్చర్యపరిచాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులో వైభవ్ 35 బంతుల్లో శతకం బాది రాజస్థాన్ ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
MOMENT OF THE DAY 🥺
– Suryavanshi touching the feet of Dhoni. pic.twitter.com/yRZwSTambG
— Johns. (@CricCrazyJohns) May 20, 2025