Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?
- ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన ఆటగాడు సంజు శాంసన్
- సంజు ఖాతాలో చెత్త రికార్డు
- సంజుకు సీఎస్‌కే కలిసి రాలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న టీమిండియా కీపర్ సంజు శాంసన్.. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)లోకి చేరాడు. అయితే కొత్త జట్టు సీఎస్‌కేతో ఆరంభం అతడికి కలిసి రాలేదు. తన మాజీ జట్టు రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సంజు కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరారు. ఆర్ఆర్ బౌలర్ నాంద్రే బర్గర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయి అభిమానులను నిరాశకు గురిచేశాడు. దాంతో సంజు ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసున్నాడు.
2020 నుంచి 2025 వరకు ప్రతి ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లలో సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. ప్రతి మ్యాచ్‌లో అర్ధ శతకం లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తూ ఒక అరుదైన రికార్డును కొనసాగించాడు. కానీ ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే అవుట్ అవ్వడంతో ఆ రికార్డుకు తెరపడింది. 2020లో సీఎస్‌కేపై 74 పరుగులు, 2021లో పంజాబ్ కింగ్స్‌పై 119 పరుగులు, 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 55 పరుగులు, 2023లో మరోసారి సన్‌రైజర్స్‌పై 55 పరుగులు, 2024లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 82 నాటౌట్, 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 66 పరుగులు చేశాడు.
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
Also Read: Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సంజును రూ.18 కోట్ల భారీ మొత్తానికి సీఎస్‌కే కొనుగోలు చేసింది. యెల్లో జెర్సీలో అతడు ఎలా ఆడతాడో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అంతేకాదు 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ తొలి మ్యాచ్‌లోనే తక్కువ స్కోర్ చేయడంతో అభిమానులు నిరాశ చెందారు. తొలి మ్యాచ్‌లోనే సంజు విఫలం కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ‘సంజుకు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ కలిసి రాలేదా?’ అని కొందరు, ‘రాజస్థాన్ రాయల్స్‌లోనే సంజు బాగుండేవాడు’ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్ ఆడతాడని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. సంజుకు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 177 మ్యాచ్‌ల్లో 4704 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!