RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!
- వైభవ్ సూర్యవంశీ మెరుపు హాఫ్ సెంచరీ
- 128 లక్ష్యాన్ని ఈజీగా ఛేదించిన రాజస్థాన్
- చెన్నై బ్యాటింగ్ కుప్పకూలిన తీరు
- బౌలింగ్‌లో ఆర్చర్-బర్గర్ సత్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ‘థంపింగ్ విక్టరీ’ని నమోదు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చెన్నై బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తన ఇన్నింగ్స్‌లో సిక్సర్ల సునామీ సృష్టించిన వైభవ్, 17 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
Off The Record: వైసీపీ కోసం మళ్లీ రంగంలోకి పీకే?
Also Read
- 2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను ముగించగా, ధ్రువ్ జురెల్ (18) మెరుపులు మెరిపించాడు. చివరలో కెప్టెన్ రియాన్ పరాగ్ (14 నాటౌట్) సిక్సర్‌తో అలరించగా, జైస్వాల్ సింగిల్ తీసి రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా పిచ్‌పై ఉన్న తేమను జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ అద్భుతంగా వాడుకున్నారు.
Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), సంజు శాంసన్ (6), ఆయుష్ మాత్రే (0), మాథ్యూ షార్ట్ (2) పవర్‌ప్లేలోనే పెవిలియన్ చేరారు. సర్ఫరాజ్ ఖాన్ (17), శివం దూబే (6) కాసేపు ప్రయత్నించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ తమ స్పిన్ మాయాజాలంతో చెన్నైని కోలుకోనివ్వలేదు. జట్టు 100 పరుగులు దాటడం కష్టమనుకున్న తరుణంలో జేమీ ఓవర్టన్ (43) పోరాడాడు. అన్షుల్ కాంబోజ్‌తో కలిసి చివరి వికెట్‌కు 32 పరుగులు జోడించడంతో చెన్నై కనీసం ఆ స్కోరైనా చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?