Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ టెక్ సపోర్ట్, నేరాలు, బెదిరింపులు, క్రిప్టోకరెన్సీ ర్యాన్సమ్ పేరిట కోట్ల రూపాయలు దోచుకుంటున్న అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రట్టు చేసింది. పంజాబ్, ఢిల్లీ కేంద్రాలుగా నకిలీ కాల్ సెంటర్లు నడుపుతున్న ఈ సిండికేట్ ప్రధాన నిందితుడితో పాటు అతడి ముగ్గురు సహచరులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ముఠా బాధితుల కంప్యూటర్ స్క్రీన్లపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులుగా నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లను ప్రదర్శించేది. ఆ నంబర్లకు ఫోన్ చేసిన అమెరికన్ల కంప్యూటర్లను సరిచేస్తామని చెప్పి భారీగా నగదు బదిలీ చేయించుకునేవారు. అంతేకాకుండా, బాధితులపై చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరాల ఆరోపణలు ఉన్నాయని భయభ్రాంతులకు గురిచేసి, క్రిప్టోకరెన్సీ ఏటీఎంల ద్వారా బిట్‌కాయిన్ రూపంలో ర్యాన్సమ్ వసూలు చేసేవారు. ఇలా సేకరించిన నిధులను అంతర్జాతీయ క్రిప్టో వాలెట్ల ద్వారా మళ్లించి, ఢిల్లీలోని ఆపరేటర్ల సహాయంతో మనీలాండరింగ్‌కు పాల్పడేవారు.
దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆగస్టు 5-6 మధ్య రాత్రి పంజాబ్‌లోని మొహాలీ, ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 20కి పైగా మొబైల్ ఫోన్లు, 15 ల్యాప్‌టాప్‌లు, పలు హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, భారీ మొత్తంలో నగదు, క్రిప్టో వాలెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బారిన పడి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ 2022లో 4.40 లక్షల డాలర్లు కోల్పోగా, 2023లో న్యూజెర్సీకి చెందిన మరొక మహిళ కంప్యూటర్ హ్యాక్ అయిందనే నెపంతో 1.30 లక్షల డాలర్లు పోగొట్టుకుంది. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ మోసాలపై సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
తాజావార్తలు
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!