Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!
- ఐపీఎల్ 2026లో జట్ల మార్పులు, కొత్త కాంబినేషన్లు
- రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి జడేజా
- పింక్ కలర్ బాగా సూట్ అయిందంటున్న జడ్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja About To Play For Rajasthan Royals in IPL 2026: ఐపీఎల్ 2026లో జట్ల మార్పులు, కొత్త కాంబినేషన్లు క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున బరిలోకి దిగడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. సోమవారం గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఆర్ఆర్ తరఫున మొదటి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2026 ముందు ట్రేడ్ ద్వారా చెన్నై నుంచి రాజస్థాన్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కొత్త జట్టుపై జడేజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా వ్యాఖ్యతతో మాట్లాడాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడడం ఎలా ఉంది అని అడగగా.. జడ్డు సరదాగా స్పందించాడు. ‘పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది’ అంటూ నవ్వుతూ చెప్పాడు. రాజస్థాన్ జెర్సీకి ప్రత్యేకమైన పింక్ రంగు ఉండటం తెలిసిందే. తన కొత్త జట్టుతో కంఫర్ట్‌గా ఉన్నాననే సంకేతాన్ని జడేజా ఈ మాటలతో స్పష్టత ఇచ్చాడు. చెన్నైపై జడ్డు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే లాంటి డేంజరస్ ప్లేయర్లను జడేజా పెవిలియన్ చేర్చాడు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
Also Read
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
Also Read: SKN : పెద్ది రిలీజ్ డేట్ కాంట్రవర్సల్ కామెంట్స్ పై SKN వివరణ
మ్యాచ్‌లో శివమ్ దూబే వికెట్ తీయడంపై కూడా ఆర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘దూబేను నేను చాలా కాలంగా చూస్తున్నా. ఇద్దరం కలిసి ఆడాం. నెట్స్‌లో కూడా అతడికి నేను బౌలింగ్ చేశాను. స్పిన్నర్లపై అతడు ఎలా ఆడతాడో నాకు బాగా తెలుసు. అందుకే ఆఫ్ స్టంప్ బయట బంతులు వేయాలని ప్లాన్ చేసుకున్నాం. లక్కీగా నాకే దొరికేశాడు’ అని జడేజా తెలిపాడు. అనుభవంతో పాటు వ్యూహాత్మక ఆలోచనలతో జడేజా రాజస్థాన్ జట్టుకు కీలక ఆటగాడిగా మారుతున్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!