భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బస్సెటెర్రేలోని వార్నర్ పార్క్‌లో జరుగుతున్న మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా…
India vs West Indies T20I First Match First Innings: బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌లు వీరవిహారం చేశారు. ఇద్దరూ కలిసి వెస్టిండీస్ బౌలర్లతో ఫుట్‌బాల్ ఆడేసుకున్నారు. ఎడాపెడా షాట్లు బాదుతూ ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన…
ICC Latest ODI Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టాప్-10 జాబితాలో టీమిండియా నుంచి ఇద్దరే ఆటగాళ్లకు చోటు దక్కింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక పాయింట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 790 పాయింట్లు ఉన్నాయి. అటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ఖాతాలో 786 పాయింట్లు ఉన్నాయి. వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 892 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.…
India Vs England: మాంచెస్టర్ వేదికగా ఈరోజు టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టీ20 సిరీస్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో షాక్ తగిలింది. 240 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. దీంతో ఇరు…
తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్‌ని భారత్ చిత్తుగా ఓడించడంతో.. రెండో వన్డేలోనూ అదే జోష్ కొనసాగించి, సిరీస్ కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ అంచనాల్ని తిప్పికొడుతూ ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. దీంతో.. వన్డే సిరీస్ 1-1తో సమం అయ్యింది. ఈ నేపథ్యంలోనే తమ ఓటమికి గల కారణాల్ని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ‘‘మా బౌలర్లు బాగా…
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ నిరాశపరిచడంతో.. అతని ప్రదర్శనపై అప్పుడే చర్చలు, విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ మరోసారి కోహ్లీ ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. ‘కోహ్లీ ప్రదర్శనపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి’ అని అనగానే రోహిత్ ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. ‘ఎందుకు చర్చలు జరుగుతున్నాయ్ అయ్యా, నాకర్థం కావడం లేదు’ అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత శాంతించి.. కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. ‘‘ఏ ఆటగాడు ఎప్పుడూ…