తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. బ్యాట్స్మన్లు పూర్తిగా చేతులెత్తేయడంతో, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఓపెనర్లు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, మిడిలార్డర్ బ్యాట్స్మన్లు కూడా రాణించకపోవడంతో.. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫస్ట్ వన్డేలో బుమ్రా తరహాలో రెండో వన్డేలో ప్రత్యర్థి బౌలర్ టాప్లీ భారత్‌ని దెబ్బ తీశాడు. ఆరు వికెట్లతో కొరడా ఝుళిపించాడు. దీంతో.. ఈ వన్డే సిరీస్ 1-1 తో సమం…
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు పలు రికార్డులు కూడా నమోదు చేసింది. ఇంగ్లండ్‌పై తొలిసారి పది వికెట్ల తేడాతో, అది కూడా అతి తక్కువ ఓవర్లలోనే విజయం సాధించిన జట్టుగా.. భారత చరిత్రపుటలకెక్కింది. బౌలర్లైన బుమ్రా, షమీలు సైతం తమ ఖాతాలు రికార్డ్స్ వేసుకున్నారు. ఇక బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ – శిఖర్ ధావన్ ద్వయం కూడా ఓ అరుదైన ఫీట్ సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన…
ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ కుదిర్చిన స్వల్ప లక్ష్యాన్ని (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ చేధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (76*), శిఖర్ ధవన్ (31*).. తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదడంతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు. తొలుత టాస్…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతు పలికాడు. విరాట్ ఫామ్ గురించి మాట్లాడేవారు రోహిత్ పేరు ఎందుకు ఎత్తట్లేదని ఆయన ప్రశ్నించాడు. రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు ఎవరూ దాని గురించి మాట్లాడలేదని… ఇతర ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని.. ఒక్క విరాట్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందో తనకు అర్థం కావట్లేదని సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకోవాలంటే ఇంగ్లండ్‌తో మూడు…
ఫామ్ కోసం తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలంటూ మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా కపిల్ దేవ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో కపిల్ దేవ్‌కు తెలియదన్నాడు. ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉన్నా డ్రెస్సింగ్ రూంలో ఒకరికి ఒకరం మద్దతు ఇచ్చుకుంటామని.. ఒక ఆటగాడి సామర్థ్యం తెలుసుకుని అతడికి అండగా నిలుస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. ఫామ్…
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. శనివారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును టీమిండియా మట్టికరిపించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన…
బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. తొలి టీ20లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ స్కోరు చేయడంతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్ స్థానంలో విరాట్ కోహ్లీ, దీపక్ హుడా స్థానంలో రిషబ్ పంత్,…
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్మన్లందరూ రాణిస్తే.. ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. 10 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న రెండో టీ20లో ఇషాన్ కిషన్‌కు బదులుగా కోహ్లీని ఓపెనర్‌గా దింపాలని కోరాడు. కోహ్లీ లాంటి మేటి ఆటగాడ్ని మూడో స్థానంలో ఆడించొద్దని సూచించాడు. ‘‘విరాట్ కోహ్లీ తుది…
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా.. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఒకే మ్యాచ్‌లో అర్థశతకం సాధించడంతో పాటు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే 60 పరుగులు చేయడంతో పాటు 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు…
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం, అలాగే సిరీస్ (2-2) సమం కావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ఆ రీషెడ్యూల్ మ్యాచ్ గెలిచి ఉంటే, సిరీస్ భారత్ సొంతమై ఉండేదన్నాడు. ‘‘ప్చ్.. చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సింది. అది గెలకపోవడం నిరాశకు గురి చేసింది. నిజానికి.. ఆ టెస్ట్ సిరీస్ భారత్ గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే…