India vs Pakistan Super Four Match Updates: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచం ఆ ఇరు జట్ల మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటోంది. ఆల్రెడీ ఈ ఇరు జట్ల మధ్య ఆసియా కప్‌లో భాగంగా ఒక మ్యాచ్ ముగిసింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో.. చివరికి భారత్ మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు సూపర్ ఫోర్‌లో భాగంగా ఈ ఇరు జట్లు మరోసారి ఈ ఆదివారం తలపడుతున్నాయి. అటు భారత్‌పై పగ తీర్చుకోవాలని పాకిస్తాన్, ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదని భారత జట్టు.. ఫుల్ కసి మీదున్నాయి. పైగా.. ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం జరగోబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అయితే.. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా, ఈ ఆదివారం జరిగే మ్యాచ్‌లో లేడు. ఇది భారత జట్టుకి కొంచెం భారమేనని చెప్పుకోవాలి.