Irfan Pathan Issues A Warning To BCCI Over Hardik Pandya Captaincy: గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దుమ్ముదులిపేస్తున్నాడు. కెప్టెన్‌గానూ తన సత్తా చాటుతున్నాడు. తొలుత ఐపీఎల్‌లో భాగంగా అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించాడు. అంతేకాదు.. పలు టీ20 సిరీస్‌లలో భారత కెప్టెన్‌గా హార్దిక్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించి, తనదైన ప్రత్యేక ముద్ర వేశాడు. కేవలం కెప్టెన్‌గానే కాదు.. చాలా మ్యాచెస్‌లోనూ ఆల్‌రౌండర్‌గానూ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టు టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించాలని బీసీసీఐ సిద్ధమవుతోంది.
Revanth Reddy: కేసీఆర్ అన్ని నాశనం చేశారు.. ఆయన్ను అరెస్ట్ చేయాలి
ప్రస్తుతం.. స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో, అతని స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ ఒక్క సిరీస్‌కే కాదు.. శాశ్వతంగా అతడ్ని పొట్టి ఫార్మాట్‌కు భారత కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది. చాలామంది మాజీ క్రికెటర్లు కూడా, అతనికే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న ఆటగాళ్లలో, అతడే ఆ పదవికి అర్హుడని చెప్తున్నారు. ఆల్రెడీ కెప్టెన్‌గా పలు టీ20 సిరీస్‌లలో భారత్‌కు మంచి విజయాలు అందించాడు కాబట్టి.. అతడే టీ20కి సరైన సారథి అంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే.. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అందరి కంటే భిన్నంగా స్పందించాడు. అతనికి కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పే ముందు కాస్త ఆలోచించాలని సెలెక్టర్లను సూచిస్తున్నాడు.
Perni Nani: తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు.. ఏపీకి ద్రోహం చేశారు
ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. తన కెప్టెన్సీతో అతడు అందరినీ ఆకట్టుకున్నాడు. అతని అప్రోచ్ విధానం బాగుంది. అయితే.. హార్దిక్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా నియమించాలని అనుకుంటే మాత్రం.. మేనేజ్‌మెంట్ అతని ఫిట్‌నెస్‌పై చాలా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఎందుకంటే, రాబోయే రోజుల్లో ఫిట్‌నెస్ చాలా కీలకం కానుంది’’ అంటూ స్టార్ స్పోర్ట్స్‌లో చెప్పుకొచ్చాడు. హార్దిక్ గాయం నుంచి కోలుకున్నా, అప్పుడప్పుడు అతనికి అది ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే పఠాన్ పై విధంగా స్పందించి ఉంటాడని అర్థం చేసుకోవచ్చు.
Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్