Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ పర్యటన నుంచి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో రోహిత్ గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడ్జ్ తీసుకొని తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నంలో అది రోహిత్ బొటనవేలిని బలంగా తాకింది. ఈ క్రమంలో అతడు క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటన వేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రిలో స్కానింగ్ కోసం పంపించారు. రోహిత్ శర్మ చేతికి కుట్లు కూడా పడినట్లు సమాచారం. దీంతో మూడో వన్డేకు దూరంగా ఉన్నాడు.
Read Also: FIFA World Cup: సేమ్ టు సేమ్.. సచిన్‌కు జరిగిందే.. మెస్సీకి జరిగింది..!!
వన్డే సిరీస్ తర్వాత టెస్ట్ సిరీస్‌లో భాగంగా రోహిత్ తొలి టెస్టు కూడా ఆడలేదు. తాజాగా అతడు రెండో టెస్టులో కూడా ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ రోహిత్ గాయం పూర్తిగా నయం కాలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అతడి బొటనవేలు ఇంకా నొప్పిగానే ఉందని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ రెండో టెస్టు ఆడినా గాయం తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. దీంతో రిస్క్ తీసుకోవడం మంచిది కాదని బీసీసీఐ భావిస్తోంది. రెండో టెస్టుకు రోహిత్‌ను దూరంగా ఉంచడమే మేలని బీసీసీఐ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో కూడా తాత్కాలిక సారథి కేఎల్ రాహులే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దీంతో తొలి టెస్టులో మొదటి టెస్టు సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్‌కు రెండో టెస్టులోనూ అవకాశం లభించనుంది.