Hyderabad: ప్రస్తుతం టీమిండియా బిజీ షెడ్యూల్‌తో క్రికెట్ ఆడుతోంది. ఇటీవల ఆసియా కప్ ఆడిన భారత్ సొంతగడ్డపై ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్, ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.…
T20 World Cup: వచ్చేనెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సెలక్టర్లు భారతజట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బౌలర్ బుమ్రా, కీలక బౌలర్ హర్షల్ పటేల్ జట్టులో స్థానం సంపాదించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. మిగతా టీమ్ అంతా దాదాపు ఆసియా కప్‌లో ఆడిన జట్టునే పరిగణనలోకి తీసుకున్నారు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ స్థానంలో బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు. అయితే షమీని స్టాండ్ బైగా ప్రకటించడం…
Team India: ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియాపై పలువురు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అసలు టీమిండియా ఆసియాకప్‌కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ పరమ చెత్తగా ఉందని.. అతడి నిర్ణయాలు అంతుబట్టలేని విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆసియా కప్‌ను ప్రయోగాల కోసం వాడుకుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌పైనా దుమ్మెత్తి పోస్తున్నారు. టీ20 ప్రపంచకప్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా టీమ్ సెట్ కాకపోవడం ఏంటని…
IND Vs SL: ఆసియా కప్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పాకిస్థాన్‌తో ఆడిన రవి బిష్ణోయ్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్‌కు స్థానం కల్పించింది. అయితే ఆశ్చర్యకరంగా దీపక్ హుడానే కొనసాగిస్తూ అక్షర్ పటేల్‌కు మరోసారి మొండిచేయి చూపించింది. గత…
Team India: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధానంగా చేసిన మూడు తప్పులే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో జట్టులోకి తీసుకున్న దీపక్ హుడా చేత బౌలింగ్ వేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇస్తున్నా అతడిని గుడ్డిగా నమ్మి ఫుల్ ఓవర్లు వేయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…
Rohit Sharma: మైదానంలో సిక్సర్లతో హోరెత్తించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. మెగా బ్లాక్‌బస్టర్ అనే మూవీలో రోహిత్ శర్మ లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదలైంది. టైట్ ఫిట్ హాఫ్ షర్ట్‌తో సాఫ్ట్వేర్ గెటప్‌లో రోహిత్ ఆకట్టుకుంటున్నాడు. ఈనెల 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో కార్తి, బీసీసీఐ ఛైర్మన్, మాజీ క్రికెటర్ గంగూలీ,…