Rohit Sharma: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ జోరుగా కొనసాగుతోంది. అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సుమారు 2 గంటల పాటు అతడు సాధన చేశాడు. భారీ షాట్‌లు ఆడాడు.. ఈ క్రమంలో రోహిత్ కొట్టిన ఓ భారీ సిక్స్ దెబ్బకు బంతి వెళ్లి నేరుగా పార్కింగ్‌లో ఉన్న తన లంబొర్గిని కారు అద్దాలను బద్దలు కొట్టింది.
Read Also: మధుమేహ రోగులకు ఆరోగ్యకరమైన ఆహారం మరియు నివారించవలసిన ఆహారాలు ఇవే..
అయితే, శివాజీ పార్క్‌లో రోహిత్ శర్మను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వెళ్లేందుకు రెడీ అవుతున్న అతడి దగ్గరకు ఓ చిన్నారి ఫ్యాన్ వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, రోహిత్ సెక్యూరిటీ ఆ పిల్లాడిని ఆపేందుకు ట్రై చేశారు. ఇది గమనించిన హిట్ మ్యాన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి ఆ చిన్నారితో రోహిత్ మాట్లాడాడు.. ప్రాక్టీస్ సెషన్‌లో రఘువంశీ సహా మరికొంత మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. ఈనెల 19వ తేదీన పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. రోహిత్ శర్మ భారత్ తరఫున చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఆడాడు.
The full batting video of Rohit Sharma from today’s practice session. 📸❤️
The Hitman looks all set to roar in Australia! 🐐🔥 @ImRo45 pic.twitter.com/HBtRfAE7Ky
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 10, 2025