ఎంత పెద్ద దొంగలైనా.. కొన్ని సార్లు చిన్న క్లూతో దొరికిపోతుంటారు.. ఇప్పుడు.. ఢిల్లీలోనే అలాంటి ఘటనే జరిగింది… ఏకంగా రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు ఎత్తికెళ్లిన ముఠా.. రూ.100 పేటీఎం చేసి దొరికిపోయింది.. ఆ ఒక్కటే.. ఆ ముఠా గుట్టురట్టు చేసింది.. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం ఇద్దరు వ్యక్తలు పహర్‌గంజ్‌లోని ఓ వీధి గుండా నడుచుకుంటూ వస్తున్నారు.. వీరిలో…
హైదరాబాద్ నగరంలో నిత్యం ఏదో ఓ చోట బైకు చోరీలకు సంబంధించిన ఘటనల గురించి వింటునే ఉంటాం. సామాన్యుల బైకుల చోరీలకు గురవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. అయితే ఏకంగా పూజారి బైక్‌నే దొంగలించడం సర్వత్రా చర్చనీయాంశానికి దారితీస్తోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ వేంకటేశ్వర ఆలయంలో రోజూలాగే ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి తన బైక్ ను ఆలయం వద్ద పార్కింగ్ చేసి ఆలయంలోపలికి వెళ్లాడు. రోజూలాగే హుండీ వద్ద పూజారీ బైక్ తాళాలు పెట్టి…
Robbery in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారిదోపిడి కలకలం రేపింది. ఓ యువకుడికి కాళ్లు చేతులు కట్టేసి అతని వద్ద నుంచి రూ.30 వేల అపహరించారు దుండగులు. ఈ ఘటన నవీపేట ఠాణా పరిదిలో మల్కాపూర్ శివారులో చోటుచేసుకుంది. read also: ADR Report: ఏపీ ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది ధనవంతులే.. రిచెస్ట్ ఎమ్మెల్సీగా నారా లోకేష్ అమిత్ పాటిల్ అనే యువకుడు మహారాష్ట్రలోని కొరేగాంకు చెందినవాడు. అతను బెంగళూరులోని ఓ దాబాలో పనిచేస్తున్నాడు. రాఖీ…
వరుస దొంగతనాలు జనం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేదు…తాళం వేసి ఎటైనా బయటకు వెళ్లారా? అంతే సంగతులు. ఆ ఇంటికి కన్నం వేసేస్తున్నారు.వారం రోజుల్లో ఆరు చోట్ల వరుస దొంగతనాలు జరిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం… బొగ్గు గనులతో విరాజిల్లుతోంది. ఎక్కువగా సింగరేణి, జెన్కో కార్మికులే ఎక్కువ. వాణిజ్య,వ్యాపార పరంగానూ అభివృద్ది చెందుతోంది.జిల్లా కేంద్రంగా మారడంతో భూపాలపల్లిలో జిల్లా ఎస్పీ నుంచి అనేక…
సనత్ నగర్ బస్టాండ్ ఆనుకుని ప్రధాన రహదారిపై ఉన్న మెడికల్ స్టార్ లో తెల్లవారుజామున ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. షట్టర్ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తూ తన దుస్తులు విప్పి దొంగ రెండు గంటల పాటు నగ్నంగానే అందులో ఉన్నాడు. తిరిగి బయటికొస్తూ దుస్తులు వేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన సనత్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది. బాలాజీ ఫార్మాలోకి అర్ధరాత్రి ఓ దొంగ ప్రవేశించాడు. షట్టర్ తాళాలు విరగ్గొట్టి లోపలికి నగ్నంగా ప్రవేశించిన దొంగ…
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ దొంగలు కలకలం సృష్టించారు.. పట్టపగలే బ్యాంకులోకి దూరి.. తుపాకీతో బెదిరించి అందినకాడికి ఎత్తుకెళ్లారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఓ బ్యాంకులో లూఠీ జరిగింది.. అనకాపల్లిలోని నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో ఈ ఘటన జరిగింది.. బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు.. బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి అందినకాడికి నగదు ఎత్తుకెళ్లారు. ఇక, బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అనకాపల్లి పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకులోని సీసీ…
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్ల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 న ఈ ఘటన జరగగా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోనమ్ ఇంట్లో పనిచేసేవారి ద్వారా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఒక ఖరీదైన ప్లాట్ లో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, అతని తల్లితండ్రులుతో…
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లోనే ఆగిపోయింది. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముఖ్యంగా ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణిస్తున్న మహిళల…
శ్రీకాకుళం జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. కంచిలి మండలం జడిపుడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. తొలుత అతడు గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు…
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్దరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఎస్ బి ఐ బ్యాంక్ ఏ టీ ఎంతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి ప్రయత్నించారు దొంగలు. దోబీఘాట్ లోని జయ్ హింద్ హోటల్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎంలలోకి ప్రవేశించారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. అర్దరాత్రి ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు.…