Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్‌ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి…
కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో ఆడుతున్న ముగ్గురు క్రికెటర్లను దుండగులు తుపాకీతో బెదిరించి నిలువునా దోచుకున్నారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9న అర్థరాత్రి బార్బడోస్‌లో చోటుచేసుకుంది. సెయింట్స్ కిట్స్‌కు చెందిన ఇద్దరు ప్లేయర్స్, నెవిస్ పేట్రియాట్స్‌కు చెందిన ఓ ప్లేయర్ సహా సీపీఎల్‌కు చెందిన ఓ అధికారిని దుండగులు దోచుకున్నారు. ప్లేయర్ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా దుండగులు వారిపై దాడికి దిగారు. దుండగులు తుపాకీతో బెదిరించి ఓ క్రికెటర్ మెడలోని గొలుసును…
నాగర్సోల్ నుంచి నరసాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు తెల్ల వారుజామున 2.47 గంటలకు నడికుడి రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి సమీపంలో దుండగులు పట్టాల పక్కన హోమ్ సిగ్నలింగ్‌ను ట్యాంపర్ చేశారు.
Khazana Jewellery : సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడలకు కన్నాలు పెట్టడం..లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో.. తెల్లవారి షాపు తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జువెలరీ షాపుకు వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటల సమయం..…
Theft : ఒకే రోజు.. మూడు చోరీలు… పోలీసులకే సవాల్ విసిరారు దొంగలు. కానీ పోలీసులు మాత్రం ఊరికే ఊరుకుంటారా..? జస్ట్ 24 అవర్స్‌లో ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. కటకటాల్లోకి నెట్టారు. ఇది హైదరాబాద్ మలక్‌పేట్ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్‌లో రోజు రోజుకు చోరీలు పెరుగుతున్నాయి. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు.. మలక్‌పేట్ ప్రాంతంలో ఒకే రోజు మూడు చోరీలు జరిగాయి. దీంతో ఈ చోరీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు… రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు.…
Palnadu: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుండగులు పథకం ప్రకారం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్…
Double Murder : హైదరాబాద్ నగరాన్ని కలకలం రేపేలా ఓ దారుణ హత్య జరిగిన సంఘటన రాజేంద్రనగర్‌లో వెలుగుచూసింది. వృద్ధ దంపతులైన షేక్ అబ్దుల్లా , ఆయన భార్య రిజ్వానాలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.వృద్ధ దంపతులు తమ నివాసంలో బెడ్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. REDMAGIC 10S Pro: మైండ్ బ్లోయింగ్…
నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు.. 29 లక్షలు దోపిడి.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. హాలీవుడ్ సినిమా తరహాలో దోపిడీ జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతం రావిరాలలో మరొకసారి ఏటీఎం దోపిడీ చోటుచేసుకుంది. నలుగురు దొంగలు.. నాలుగు నిమిషాలు 29 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకొని పోయారు.
భాగ్యనగరంలో దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దుండగులు భారీగా బంగారం, నగదును దోచుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవలి రోజుల్లో వరుస చోరీలతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా హిమాయత్ నగర్లో భారీ చోరీ జరిగింది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు దొంగలు. వ్యాపారి లబోదిబోమంటూ హిమాయత్ నగర్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలలం రేపింది. వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్లో నివాసం ఉండే బంగారం వ్యాపారి…