ముక్కలేనిదే ముద్ద దిగని వారికి ఆకాశాన్నంటిన చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనలేరు.. తినకుండా వుండలేరు. బంగారం దొంగతనం చూశాం, డబ్బులు దొంగతనం చూశాం, విలువైన వస్తువులు కోసం దొంగతనాలు చూశాం. కానీ చికెన్ రేట్లు పెరగడంతో కోళ్ల దొంగతనం చేసిన ముగ్గురు యువకుల కథ ఇది. బైక్ పై వచ్చి దర్జాగా దొంగతనం చేసుకొని ఉడాయించారు. గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగులు రాత్రి సమయంలో చికెన్ దుకాణాలను టార్గెట్ చేశారు.…
దొంగలు రెచ్చిపోతున్నారు. అదను చూసి, మాటువేసి మాయ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన దారిదోపిడీ పోలీసులకు సవాల్ విసురుతోంది. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 10లక్షల రూపాయల దారి దోపిడీ జరిగింది. పురానాపూల్ రోడ్డులో 10 లక్షల రూపాయలతో వెళుతున్న ఓ వ్యక్తి దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడ్డారు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు. ఓ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వ్యక్తి చేతిలోని 10లక్షల రూపాయల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. దీంతో బహదూర్ పుర పోలీస్ స్టేషన్…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె ఇంట్లో విలువైన దుస్తులు, కెమెరా కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పనిచేసే ధనుష్ పై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని రోజుల క్రితం ధనుష్ అనే యువకుడు తమ ఇంట్లో పనికి కుదిరాడని, ఎప్పుడైతే దుస్తులు, కెమెరా చోరీ అయ్యాయో అప్పటినుంచి అతను కనిపించడం లేదని తెలిపింది. వాటి విలువ సుమారు రూ. లక్ష…
ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లి వచ్చే సరికి దొంగలు ఇల్లు కొల్లగొట్టిన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తకోనేరు వీధికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉన్న తన కొడుకు ఇంటికి తన భార్యతో కలిసి డిసెంబర్ 31న వెళ్లాడు. అయితే చెన్నై నుంచి తిరిగి రావడానికి ఇంటిలో వున్నకారు తీసుకొనిరా అని డ్రైవర్ ను పురామాయించాడు. దీంతో కారుకోసం ఇంటిదగ్గరకు…
జంటనగరాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో దోపిడీలకు తెగబడుతున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి గుండుగొలను వరకు చెడ్డీగ్యాంగ్ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దొంగతనాలు చేసిని ఈ ముఠా ఇప్పడు విజయవాడలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్టినగర్, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటేవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే…
చిత్తూరు జిల్లాలో బ్లాక్ ప్యాడి వరి పై కన్నేసారు దుండగులు. పుంగనూరు(మం) బొడినాయుడు పల్లె గ్రామంలో బ్లాక్ ప్యాడి వరి (నల్లబియ్యం) కంకులు దొంగతనం చేసారు. అతి ఖరీదైన అరుదైన పంట ఈ నల్ల బియ్యం పంట కంకులను అర్ధరాత్రి కంకులు కోసుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. బ్లాక్ పైడి బియ్యం మార్కెట్ విలువ కేజీ సుమారు 320రూ ఉంది. అయితే ఈ కొత్త పంట పై రైతులకు ఆసక్తి కోసం ఒకటిన్నర ఎకరాల్లో ఈ పంట వేసాడు…
దొంగతనం చేయాలంటే దానికి తగిన విధంగా విధంగా పక్కాగా ప్లాన్ ఉండాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనం చేయాలి. అయితే, వీటితో పాటుగా ఓ దొంగ వెరైటీగా ప్లాన్ చేశాడు. తన పాత యజమాని ఇంటికి కన్నం వేయడం కోసం ఏకంగా 5 కిలోల బరువు తగ్గాడు. వేసుకున్న ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి నగుదు దోచుకెళ్లాడు. అయితే, ఓ వస్తువును అక్కడే వదిలేయడంతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… Read: తీరం…
రాజేంద్ర నగర్‌లోని కాటేదాన్ లో దోపిడీ దొంగల గ్యాంగ్ హల్ హల్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద యాసిన్ అనే ఆటో డ్రైవర్‌కు తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు లోనై యాసిన్ ఆటోను విడిచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో యాసిన్ వెంటబడ్డ దొంగల ముఠా అతనిపై దాడి చేసి రూ.3200లతో పాటు అతని మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు యాసిన్ వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు…
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఘరానా లూటీ జరిగింది. పట్టపగలే సినీఫక్కీలో ఓ కారు అద్దాలు పగులకొట్టి దొంగలు రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే… జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి, ఆయన కుమారుడు సాయి గణేష్… బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టారు. డ్రా చేసిన తర్వాత సంతకం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే… డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు…