90 Degree turn Bridge: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని ఐష్‌బాగ్ స్టేడియం సమీపంలో నిర్మించిన ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముందే.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించారు.
VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డుప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు బైక్‌పై తీవ్ర నిర్లక్ష్యంతో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోను చూస్తే, వ్యక్తి బైక్‌పై పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు.…
ఇటీవల కాలంలో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతన్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో పని గంటలు కూడా ఓ కారణం. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్లు అలసిపోతుంటారు. నిద్రలోకి జరుకోవడం, తీవ్ర నీరసం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలెపూర్ గ్రామం వద్ద ఐచర్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో డీసీఎం వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Konda Vishweshwar Reddy : చేవెళ్ల మండలం ఆలూరు గేటు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. నేను ఇవాళ సాయంత్రము పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఈ దుర్ఘటనలో గురించి తెలిసిందని, తీవ్ర ఆందోళనకు లోనయ్యానన్నారు. ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినారు అని, పది మందికి పైగా తీవ్రమైన గాయాలు అయ్యాయని నాతో చెప్పారని, హైదరాబాద్ వైపు నుంచి చేవెళ్ల వైపు పోతున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా…
Keesara Accident: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విపరీతంగా రక్తస్రావం అవుతుంది. ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆ వ్యక్తి వేడుకున్నా స్థానికులు బాధితుడికి సాయం చేయలేదు. తీవ్ర రక్తస్రావం అవుతుంది కాపాడండి అని బాధితుడు వేడుకుంటున్నా.. చిత్రాలు, వీడియోలు తీస్తూ కాలం గడిపారు. ఈ సంఘటన కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. Read also: Mancherial: మంచిర్యాలలో 600 పడకల ఆసుపత్రి.. నిర్మాణ పనులకు మంత్రి దామోదర శంకుస్థాపన.. కీసర సీఐ…
భారతదేశంలో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటీవలి డెహ్రాడూన్ కారు ప్రమాదంలో 6 మంది యువకులు మరణించడం రోడ్డు ప్రమాదాలపై తీవ్రంగా కృషి చేయవలసిన అవసరాన్ని బలంగా లేవనెత్తింది.
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Hyderabad New Traffic Rules :హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి భారీ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల గత మూడు రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు. అలాగే, ఈ మూడు కేసుల్లోనూ బాధితులు రక్షణ…
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రోడ్లు రక్తమోడాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.