కరోనా లాక్‌డౌన్ కారణంగా 2020లో ఏపీలో రోడ్డుప్రమాదాలు తగ్గాయి. అయితే 2021లో మళ్లీ రోడ్డుప్రమాదాల్లో చనిపోయిన వారి మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ మేరకు ఏపీ రహదారి భద్రత కౌన్సిల్ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం… గత ఏడాది ఏపీలో మొత్తం 19,729 రోడ్డుప్రమాదాలు జరగ్గా.. వాటిలో 8,053 మంది చనిపోయారు. మరో 21,169 మంది గాయపడ్డారు. 2020తో పోలిస్తే 2021లో రోడ్డుప్రమాదాల్లో 10.16 శాతం, మరణాల్లో 14.08 శాతం, క్షతగాత్రుల్లో 7.94…