విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లిలోని తుమ్మల చెరువు సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై గీతిక స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పోలీసులు పరిశీలించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను శ్రీపొట్టి…
హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు.. స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్లో జరిగింది.
Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన…
Doctors Died In Road Accident: ఉత్తరప్రదేశ్ లోని సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు వైద్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. వైద్యులంతా లక్నో నుంచి ఆగ్రాకు స్కార్పియోలో వెళుతుండగా, వారి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అందిన సమాచారం మేరకు, ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కన్నౌజ్‌లోని తిర్వా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల…
UP Accident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు నెత్తురోడింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ వోల్వో బస్సు ఒకటి.. ట్రక్కును స్పీడ్ గా ఢీ కొనింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే ఐదురుగు చనిపోగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా గంట్యాడ మండలం ఎగువ కొండపర్తిలో గల వైకుంటగిరి అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి వస్తుండగా బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Bus Fall In Valley: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఘోర ప్రమాద వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ శనివారం వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. కాగా, మరో 6 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని బునెర్ జిల్లాలో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం బ్యాలెన్స్ కాకపోవడంతో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి…