Road Accident: శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో స్పాట్‌లోనే నలుగురు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరో నలుగురి పరిస్థితి విషయంగా ఉంది. మడకశిర మండలం బుల్లసముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టెంపో ట్రావెలర్ వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.. మృతులు, క్షతగాత్రులు అంతా గుడిబండ మండలం కే ఎన్ పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.. వాహనంలో ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు, డ్రైవరు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారు.. మృతులను ప్రేమ్ కుమార్ (30), అతర్వా (2) , రత్నమ్మ (70) , మనోజ్ (30)గా గుర్తించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?