Punishment For Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు, అతని స్నేహితురాలికి జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వెస్ట్‌మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే 27 ఏళ్ల తీగుళ్ల దయా సాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల ఫిలింనగర్‌లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు, దయా సాయిరాజ్ తన బెంజ్ కారులో తన స్నేహితురాలిని పక్కన కూర్చోబెట్టుకుని మితిమీరిన వేగంతో ప్రయాణించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డివైడర్, విద్యుత్ స్తంభం ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Also Read: Kusal Perera: కొత్త ఏడాది మొదటిరోజే 14 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన కుశాల్ పెరీరా
జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని యువ జంటని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే, జడ్జి వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇక జడ్జి తీర్పులో, ప్రతిరోజూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రిసెప్షన్‌లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్ వచ్చే వారికి రిషిప్షన్ లో ఉండి నవ్వుతూ స్వాగతం పలకాలని, అలాగే ముఖానికి మాస్క్ ధరించకూడదని ఆదేశాలు ఇచ్చారు. 15 రోజులపాటు ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిసెప్షన్‌లో కూర్చోవాలని, ఆ తర్వాత పోలీసుల సమక్షంలో సంతకం చేయాలని షరతు విధించారు. దీనితో, దయాసాయిరాజ్‌తో పాటు ఆయన స్నేహితురాలు రోజూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రిసెప్షన్‌లో కూర్చుంటున్నారు.