ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు ఆర్కే రోజా.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు
కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మహిళల అక్రమ రవాణాపై ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు ఆర్కే రోజా.. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్... మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా..? అని…
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్పై ఎఫెక్ట్! ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర…
RK Roja: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కేసు నందైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కారణమైన ఘటనకు సంబంధించిన వీడియోపై రోజా స్పందించారు. జగన్ కు వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కక్ష్య సాధించడంలో భాగామే ఈ కేసు పెట్టారంటూ ఆమె అన్నారు. జగన్ పై కేసు పెట్టడానికి ఒక ఫేక్ వీడియోను బయటకు…
కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా...? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు…
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. ముంచే ప్రభుత్వం అని విమర్శించారు. 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి.. ఒక పథకంను కూడా అమలు చేయడానికి వారికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు సూపర్ అమలు చేశామని చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. ఒక్క పథకంను అమలు చేయకుండా, ఒక్క అభివృద్ధి పని చేయకుండా.. అన్ని చేశామని చంద్రబాబు చెప్పడంపై…
సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్‌కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. "రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే…
లాస్ ఏంజిల్‌లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయితే ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లాస్ ఏంజిల్‌లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అయితే బలగాలు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇక ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. దీంతో నేషనల్ గార్డ్స్ మోహరించాలని…
RK Roja: ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్న పరిస్థితిని ఆమె ఆవేదనతో వివరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై మండిపడుతూ.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పుడు మహిళలకు రక్షణే లేదు. హోంమంత్రి అనిత మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి హోంమంత్రి పదవి ఆమె ఎందుకు చేపట్టారు..? మహిళలపై…
కూటమి ప్రభుత్వం అధికర్మలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేయాకుండా రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు అయినా కూటమి ప్రభుత్వం వేసిందా? అని ప్రశ్నించారు. కూటమి నేతలు సూపర్ సిక్స్ పక్కనపెట్టి.. సూపర్ స్కామ్‌లు చేస్తున్నారని విమర్శించారు. కూటమి నేతలు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇసుక మాఫియాతో రెచ్చిపొతున్నారన్నారు. చంద్రబాబు వచ్చాక టీడీపీ నేతలకు పదవులు వచ్చాయని, ప్రజల చేతికి మాత్రం చిప్ప…