RK Roja Said CM Chandrababu, Pawan Kalayan are weekend leaders: రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు అంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలి అని హెచ్చరించారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతున్నారని.. రేపు యూఎస్ పోతారు అని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిందని, ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడు అని రోజా ఎద్దేవా చేశారు. నగరిలో నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
‘ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు. గాల్లో గెలిచిన గాలిగాళ్లు రాష్ట్రంలో ఎక్కువయ్యారు. ఒక్కరు కూడా ప్రజలు దగ్గర వెళ్లి ఏం కష్టమో ఆడగరు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతున్నారు.. రేపు అమెరికా పోతారు. అప్పుడు జనసేన, టీడీపీ కార్యకర్తలను కాపాడడానికి ఎవరు ఉండరు. పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరింది. పవన్ ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదు. ఎక్కడికి వెలితే అక్కడ నేను పుట్టాను అంటాడు. ఆఖరికి సుబ్రహ్మణ్య స్వామి అభిమానిని అంటాడు’ అని మాజీ మంత్రి రోజా విమర్శించారు.
Also Read: Kadapa Central Jail: కడప కేంద్ర కారాగారంలో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు!
‘సీఎం చంద్రబాబు లెక్క ఎక్కవగా ఇస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పిచ్చి బాగా ముదురి పాకం పడింది. చంద్రబాబు, పవన్, నారా లోకేష్ వీకెండ్ నాయకులు. ప్రజలకు రేషన్ ఇచ్చే వాహనాలకు డబ్బులు లేవు కానీ.. వీళ్లు మాత్రం హెలికాప్టర్, విమానాలలో తిరుగుతున్నారు’ అని ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విడియోపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. రోజా మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా రెండు వేలకు ఏ పనైనా చేసే ఆమె రూ.2000 కోట్ల సంపాదించి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందంటూ నగిరి ఎమ్మెల్యే భాను తీవ్ర స్థాయిలో మాట్లాడారు.