BJP: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. అన్ని ఎగ్జిట్స్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే గెలుస్తుందని చెప్పాయి. మరోసారి, బీజేపీ+జేడీయూలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించాయి. ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమి మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతాయని అంచనా వేశాయి.
ఇండియా కూటమి లక్ష్యంగా మరోసారి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీతామర్హిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. యువతకు మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోందని విరుచుకుపడ్డారు. తొలి దశ ఎన్నికల్లో జంగిల్ రాజ్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు.
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 64.46 శాతం నమోదైనట్లు, మరికొన్ని స్థానాల్లో ఇంకా ఓటింగ్ జరుగుతున్నట్లు బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ గుంజ్యాల్ చెప్పారు. 73 ఏళ్ల బీహార్ ఎన్నికల చరిత్రలో ఇదే హైయెస్ట్. 2020లో జరిగిన ఎన్నికల్లో మొదటిదశలో నమోదైన దాని కన్నా ఎక్కువ నమోదైంది.
Amit Shah: భారత సైన్యంపై ‘‘కుల’’ వ్యాఖ్యలు చేసినందకు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. గురువారం బీహార్‌లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహరీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన ఆయన, రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తొలి విడతలో ఇప్పటివరకు 58 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో మొత్తం 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.…
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతోంది. అయితే, రాష్ట్రంలోని లఖిసరై జిల్లాలో పోలింగ్ రోజున ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో, ఆవు పేడతో, చెప్పులతో దాడులు చేశారు.
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయ ప్రవేశం చేశారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అప్పటి నుంచి బీహార్‌తో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇక మైథిలి ఠాకూర్‌కు సొంత ప్రాంతంలో కాకుండా అలీనగర్ సీటును బీజేపీ కేటాయించింది.
కుటుంబ సభ్యులతో కలిసి మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు వేశారు. బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. 121 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తేజస్వి యాదవ్ కూడా తన కుటుంబంతో కలిసి వచ్చి పాట్నాలో ఓటు వేశారు.
Bihar elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. గురువారం బీహార్‌లో మొదటి విడుత ఓటింగ్ జరబోతోంది. దీనికి ఒక్క రోజు ముందే ప్రశాంత్ కిషోర్‌కు ఆయన పార్టీ అభ్యర్థి ఝలక్ ఇచ్చారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని…
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.