బీహార్‌లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి మాత్రం ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
Bihar Elections: బీహార్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
నిన్నామొన్నటి దాకా ఓటర్ యాత్ర పేరుతో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి బీహార్ అంతటా తిరిగాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కలలు కన్నాయి. కానీ చివరికి అంతా తుస్ మనిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.. ఓ వైపు నామినేషన్లు వేస్తున్నారు.
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
బీహార్ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకోవైపు అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. కానీ ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది.
బీహార్‌లో ప్రస్తుతం సీట్ల పంపకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా ఆర్జేడీ తీవ్ర కసరత్తు చేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
బీహార్‌లో హైవోల్టేజ్ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, భార్య రబ్రీ దేవిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది.
Bihar Elections: బీహర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్డీయే, ఇండియా కూటముల్లో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 100 సీట్లలో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం శనివారం తెలిపింది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. బీహార్‌లో తాము థర్డ్ ఫ్రండ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు…
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు.