Nitish Kumar: బీహార్‌లో నీతీశ్ కుమార్ ప్రభుత్వం ఇవాళ బలపరీక్ష ఎదుర్కోనుంది. బీజేపీ మద్దతుతో సునాయాసంగానే దీనిని గట్టెక్కే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే, ప్రధాన విపక్షమైన ఆర్జేడీ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. దీంతో అసెంబ్లీలో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రసంగం కొనసాగుతోంది. అనంతరం స్పీకర్(ఆర్జేడీ) అవధ్ బిహారీ చౌధరీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. బీజేపీ-జేడీయూ నేతలు ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత బలపరీక్ష జరగనుంది.
Read Also: Pushpa 2: ఫ్యాన్స్ కు ప్రామిస్… పుష్ప 2 అంతకు మించి ఉంటుంది
అయితే, ఈ క్రమంలో బీజేపీ- జేడీయూ శిబిరం నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, వారిలో ఏడుగురు బలపరీక్షకు ముందే శిబిరానికి తిరిగి వచ్చేశారు. మరొకరి జాడ ఇప్పటి వరకు తెలియల్సి ఉంది. మరో పక్క ఆర్జేడీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పట్నాలోని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ ఇంటి దగ్గర నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చింది. కాగా ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజీవ్, బీమా భారతి ఇంకా బీహార్ అసెంబ్లీకి చేరుకోలేదు.. దీంతో సీఎం నితీశ్ కుమార్ టెన్షన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ కూడా ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చారు.