Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ,…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో లాలూకి చెందిన ఆర్జేడీ పార్టీ మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ సభలో నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగే సమయంలో ఎమ్మెల్యే రేఖాదేవిపై సీఎం ఫైరయ్యారు. ఆర్జేడీ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ..‘‘ మీరు మహిళ, మీకు ఏమీ తెలియదు. సైలెంట్‌గా వినండి’’ అని సభలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
JDU: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆర్జేడీడీ నేత, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ ఫైరయ్యారు. బడ్జెట్‌లో సామాన్యులకు ఏమీ లేదని, కేంద్రం బీహార్‌కి బొమ్మ(జుంఝానా) మాత్రమే ఇచ్చిందని ఆమె అన్నారు.
Bihar: బీహార్‌లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది.
Lalu Prasad Yadav: ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై ‘‘ల్యాండ్ ఫర్ జాబ్’’ స్కామ్‌లో సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లాలూతో సహా చార్జిషీట్‌లో మరో 77 మందిని ఉన్నారు. కాంపిటెంట్ అథారిటీ నుంచి ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని సీబీఐ కోర్టు తెలిపింది.
బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేలో ‘కింగ్ మేకర్’ హోదాను ఉపయోగించాలని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వీ యాదవ్ కోరారు.
జూన్ 4 తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకుంటారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. పాట్నాలో జర్నలిస్టులతో తేజస్వీ మాట్లాడారు. బీజేపీతో నితీష్ సరిగా ఉండడం లేదని చెప్పారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు.