Ban on Mobile Phones in Classrooms Across UK: ప్రస్తుతం ప్రతిఒక్కరు మొబైల్స్ ఫోన్ వాడడం ఎక్కువైపోయింది. అవసరం లేకున్నా.. మొబైల్ ఫోన్ వాడుతూ గంటల తరబడి సమయం వెచ్చిస్తున్నారు. ఇంట్లోనే కాకుండా.. ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లలో కూడా ఫోన్ల వాడటం ఎక్కువైపోయింది. ముఖ్యంగా పిల్లలు ఫోన్‌కు బానిసగా మారి.. చదువుపై దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రుషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేదించారు.…
బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది.
యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించిన స్థావరాలపై అమెరికా- బ్రిటన్ దళాలు బాంబులతో దాడి చేశాయి. ఈ దాడిలో హౌతీ రెబల్స్ కు సంబంధించిన పరికరాలు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల నిల్వలు పూర్తిగా దెబ్బ తిన్నాయని అధికారులు సమాచారం అందించారు.
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అయితే దీనిపై చర్చల విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి అక్కడి ప్రభుత్వ వర్గాలు. సోషల్ మీడియా వల్ల పిల్లలపై ఎంత వరకు హాని కలుగుతుందనే విషయంపై మంత్రులు జనవరి నుంచి సంప్రదింపులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ విచిత్రమైన పరిస్థితిని ఎదర్కొన్నారు. అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ బయట లాక్ అయ్యారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే కూడా రిషి సునాక్‌తో కాసేపు బయటే ఉన్నారు. అక్కడ ఉన్న మీడియా అంతా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌గా మారింది. రిషి సునాక్, డచ్ ప్రధాని మార్క్ రొట్టేను అధికార నివాసం వెలుపల స్వాగతిస్తూ, మీడియాకు ఫోటోగ్రాఫ్ ఇచ్చారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేబినేట్‌లో బ్రిటిష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌కు చోటు కల్పించారు. తన కేబినేట్ పున:వ్యవస్థీకరలో భాగంగా కామెరూన్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించారు.
భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. బుధవారంనాడు జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Israel: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పై భీకరదాడికి తెగబడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను కాల్చి చంపారు. పలువురిని మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజాపై ఎదురుదాడికి దిగింది. మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది
ఒత్తిడి కారణంగా ఈ మధ్య యువత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. కొన్ని సార్లు చెడు సావాసల కారణంగా కూడా మద్యం, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల యువత భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే బ్రిటన్ ప్రభుత్వం త్వరలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో సిగరెట్లపై నిషేధం విధించాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. దీనిపై ప్రభుత్వం అధికారంగా వెల్లడించనప్పడికీ దీనిని కచ్ఛితంగా…