Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట్లో దీపావళి వేడుకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. బుధవారంనాడు జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి అధికార నివాసాన్ని రంగు రంగుల దీపాలతో రెడీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా
రిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు వెల్లడించారు.
Read Also: Telangana Assembly Election: ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్.. ఒక్క ట్రిప్‌కు 2 నుంచి 5 లక్షలా..
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ఇక, భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ దీపావళి వేడులక కార్యక్రమంలో పలువురు ఇండో అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ తదితరులతో కమలా హ్యారిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్ ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరును గురించి ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సహాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!