ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2022లో యూకే ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి సునక్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి.
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి భారత రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. కాగా, శనివారం నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సు కోసం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌కు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
దేశ రాజధానిలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.
సెప్టెంబరు 9 నుంచి న్యూఢిల్లీలో జరగనున్న G20 లీడర్స్ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుల కలయికకు సాక్ష్యమివ్వనుంది. జీ20 సమ్మిట్‌కు హాజరుకావడానికి అగ్ర దేశాల నేతలు రేపు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు.
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు.
Rishi Sunak: బ్రిటన్, ఇండియాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరగా ముగించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అనుకున్నారు,
బ్రిటన్ కేబినెట్‌లో మరో భారతీయ సంతతికి చెందిన మహిళ చేరనున్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషీ సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ కేబినెట్‌లో మరో భారత సంతతి మహిళ చేరారు. గోవా మూలాలున్న 38 ఏళ్ల క్లెయిర్ కౌటినో ను ఇంధనశాఖ మంత్రిగా గురువారం ప్రధాని రిషి సునాక్ నియమించారు.
Rishi Sunak : భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేలింది. సునాక్ భార్య అక్షత మూర్తికి పలు చైల్డ్ కేర్ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని సునాక్ వెల్లడించలేదు. దీంతో తన భార్యకు ఉన్న షేర్ల విషయం చెప్పకుండా రిషి సునాక్ పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించారని విపక్షలు ఆరోపించాయి. ఈ చైల్డ్ కేర్ పథకాలతో అక్షత మూర్తి లబ్ధి పొందుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే…
England And Australia PM’s Engage In Hilarious Ashes 2023 Banter: యాషెస్ 2023 సిరీస్ ప్రభావం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులపైనా పడింది. ‘నాటో’ సమ్మిట్‌లో భాగంగా ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ యాషెస్ 2023పైన చర్చించారు. ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఔట్‌ను ప్రస్తావిస్తూ.. ఆసీస్ ప్రధానికి ఇంగ్లండ్ ప్రధాని ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియోను ఆస్ట్రేలియా ప్రధాని ట్విటర్ వేదికగా ఓ వీడియోను…
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో కొన్ని వివాదాల్లో ఆయన ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సారి ‘పెన్ను’ వివాదంలో రిషి సునాక్ చిక్కుకున్నారు. ఇప్పటికే అక్కడి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టలేక రిషి సునాక్ విమర్శల పాలవుతున్నారు. ఆయన ఉపయోగిస్తున్న పెన్ను ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఎరేజబుల్ ఇంక్‌తో ఉన్న పెన్నును రిషి సునాక్ వాడటం ప్రస్తుత వివాదానికి కారణమైంది.