బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. అయితే, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా ఈ వ్యాధి బయటపడిందన్నారు. అది ఏ రకమైన క్యాన్సరనేది ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు.. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని బకింహం హాం ప్యాలెస్ పేర్కొనింది.
Read Also: Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ వద్దకు దూసుకొచ్చిన సర్పంచ్‌లు.. అడ్డుకున్న పోలీసులు
మరోవైపు.. వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని చికిత్స టైంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని ప్యాలెస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించబోతున్నారని పేర్కొన్నారు. 2022 సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2, 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా నియమకం అయ్యారు.
Read Also: Uttarakhand: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలోకి యూసీసీ బిల్లు
అయితే, ఛార్లెస్-3 క్యాన్సర్ బారిన పడడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. మీరు త్వరగా కోలుకుని.. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని ట్విట్టర్ (ఎక్స్ ) తెలిపారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్ కూడా ఎక్స్ వేదికగా రాజు చార్లెస్ -3 త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Wishing His Majesty a full and speedy recovery.
I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv
— Rishi Sunak (@RishiSunak) February 5, 2024