ఒత్తిడి కారణంగా ఈ మధ్య యువత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. కొన్ని సార్లు చెడు సావాసల కారణంగా కూడా మద్యం, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల యువత భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే బ్రిటన్ ప్రభుత్వం త్వరలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో సిగరెట్లపై నిషేధం విధించాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. దీనిపై ప్రభుత్వం అధికారంగా వెల్లడించనప్పడికీ దీనిని కచ్ఛితంగా అమలు చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాలకు చెందిన వారు కూడా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం అందించడం లేదు, పెదవి విప్పడం లేదు.
Also Read: Multibagger Stocks: ఈ స్టాక్ ముందు రాకెట్ వేగం కూడా తక్కువే.. రూ.10 వేలు పెడితే రూ.2 లక్షలు
గతేడాది న్యూజిలాండ్ ఈ విధానాన్నే అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విధానాన్నే రిషిక్ సునాక్ ప్రభుత్వం కూడా ఫాలో అవ్వాలని చూస్తుందట. అందులో భాగంగా అందులో భాగంగా 2009 జనవరి ఒకటో తేదీ తరువాత జన్మించిన వారికి సిగరెట్లు అమ్మకుండా నిషేధం విధించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారట. న్యూజిల్యాండ్ లో సిగరేట్ల పై నిషేధం ఉండటంతో అక్కడ కొన్ని ప్రత్యేకమైన షాపుల్లో మాత్రమే సిగరెట్లు విక్రయిస్తున్నారు. ఇక బ్రిటన్ లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారుడ్ని కేంద్రీకృతం చేసుకొని విధానాలు రూపొందించడానికి సిద్దమవుతున్నారట. దీని ద్వారా 2030 నాటికి బ్రిటన్ ను ధూమపాన రహిత దేశంగా మార్చాలని గట్టి పట్టుదల మీద ఉన్నారట. గర్భిణులు ధూమపానాన్ని విడిచిపెట్టేలా ప్రోత్సహించే ఉచిత వేప్ (కిట్‌ల వోచర్ పథకం కూడా ప్రభుత్వం ఇందులో భాగంగా తీసుకురానుందట. అంతేకాకుండా కేవలం వైద్యుల సూచన మేరకు మాత్రమే ధూమపానం చేయాలని అలా వైద్యుల అపాయింట్‌మెంట్ తీసుకొని వెళ్లని వారికి 10 పౌండ్లు (సుమారు రూ.1000) జరిమానా విధించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిందట. అయితే అలా చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చని భావించిన అధికార పార్టీ దాని నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.