యూకే ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు. ఆమె నాయకత్వంలో భారత్-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ అభినందన సందేశంలో పేర్కొన్నారు.
బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కన్జర్వేటివ్ నాయకత్వ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ను ఓడించారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఆరు వారాలుగా హోరాహోరీ ప్రచారంతో పాటు పోలింగ్ కూడా పూర్తయింది.
Rishi Sunak and wife perform ‘gau pooja’ in London, video goes viral: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్.. హిందూ ఆచారాలను పాటిస్తారని అందరికీ తెలుసు. కుటుంబ సమేతంగా హిందూ పండగలను జరుపుకుంటారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ ఏం చేసినా.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా రిషిసునక్, అతని భార్య అక్షతా మూర్తి కలిసి ‘గో పూజ’లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో బ్రిటన్ లో…
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రసిద్ధ హిందూ పండుగ జన్మాష్టమిని జరుపుకోవడానికి తాను తన భార్యతో కలిసి ఆలయాన్ని సందర్శించినట్లు ఓ చిత్రాన్ని రిషి సునాక్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
బ్రిటన్ ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్ ఉండి ఉంటే ఆయనకే మళ్లీ పీఠం దక్కి ఉండేదని 'స్కై న్యూస్' కోసం నిర్వహించిన యూగస్ సర్వేలో తేలింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్‌నే కోరుకుంటున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది.
UK PM Race: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానం కోసం భారత సంతతి వ్యక్తి రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. గతంలో పీఎం రేసులో అన్ని దశల్లో మొదటి స్థానంలో నిలిచిన రిషి సునక్... ఆ తరువాత జరిగిన డిబెట్లలో లిజ్ ట్రస్ తర్వాత నిలుస్తున్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. తాజాగా ఓపినియం రీసెర్చ్…
UK PM Race - Rishi sunak: బ్రిటన్ ప్రధాని ఎన్నికలు, కన్జర్వేటివ్ పార్టీకి అధ్యక్ష పదవికి సంబంధించి భారత సంతతి వ్యక్తి రిషి సునక్, మరో అభ్యర్థి లిజ్ ట్రస్ కు మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల కొన్ని సర్వేల్లో ప్రధాని పదవిలో లిస్ ట్రస్ ముందున్నారని వెల్లడించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఇటలీకి చెందిన పొలిటికల్ అఫైర్స్ కంపెనీ టెక్నీ నిర్వహించిన ఓ సర్వేలో రిషి సునక్ పుంజుకున్నట్లు వెల్లడించింది. వీరిద్దరి…
Liz Truss leads with 90 pc chance in race for next UK PM: యూకే ప్రధాని రేసులో రిషి సునక్ కు షాక్ తగిలేలా కనిపిస్తోంది. ముందు నుంచి ప్రధాని రేసులో ముందువరసలో ఉన్న రిషి సునక్ కీలకమైన పోటీని ఎదుర్కొంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు గెలుచుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల ఓట్లను సంపాదించాల్సి ఉంది.