ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2025ని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఓటమితో ఆరంభించింది. విశాఖపట్నం వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ 9 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాల కారణంగా లక్నో ఓడిపోవాల్సి వచ్చింది. 20వ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్…
Rishabh Pant: వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. LSG బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇది ఇలా ఉంటే కెప్టెన్ రిషబ్ పంత్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఈ పోరులో పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండా…
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు ముస్సోరీలో జరుగుతున్నాయి. బుధవారం, గురువారం రెండ్రోజులుగా ఐటీసీ హోటల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సతీసమేతంగా కలిసి వచ్చాడు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Rishabh Pant: రెండు సంవత్సరాల క్రితం భయంకరమైన కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ టీమిండియాకు తిరిగి వచ్చాడు. మృత్యువును ఓడించి క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చిన భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ (Laureus World Sports Awards) విభాగంలో నామినేట్ అయ్యాడు. Read Also: Rashmika: కర్ణాటక ఎక్కడుందో తెలియదా? రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాలి! డిసెంబర్ 2022లో పంత్…
క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ తన ఇంటికి వెళ్తుండగా.. డెహ్రాడూన్ హైవేపై అతని కారు ప్రమాదానికి గురైంది. అయితే.. హైవేపై ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు పంత్ ప్రాణాలను కాపాడారు. అయితే.. పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తులలో రజత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.
బీసీసీఐ యుజ్వేంద్ర చాహల్ కెరీర్‌ను దాదాపుగా క్లోజ్ చేసింది.. అలా ఎందుకు జరిగిందనేది అర్థం చేసుకోవడం కష్టమే అన్నారు ఆకాశ్ చోప్రా. ఇక, యూజీ చివరిసారిగా 2023 జనవరిలో వన్డే మ్యాచ్‌లో ఆడాడు. అప్పటి నుంచి నేటి వరకు అతడు ఆడలేదు.
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్‌తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల…
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను దక్కించుకున్న లక్నో.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ మాట్లాడుతూ.. వేలంలో పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ తీసుకుంటుందేమోనని…