Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో మంగళవారం రాత్రి జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ లో మరోసారి ప్రాబ్లమ్ LSGను వెంటాడింది. మూడోసారి స్లో ఓవర్‌రేట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు కెప్టెన్ రిషబ్ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా పడింది. అంతేకాదు జట్టులోని ఇక మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజు 50 శాతం (ఏది తక్కువైతే అది) ఫైన్…
RCB vs LSG: లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ఈ సీజన్‌లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఆర్సీబీ బౌలర్‌లకు చుక్కలు చూపించాడు పంత్.
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) నిష్క్రమించిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లక్నో.. సీజన్ మధ్యలో వరుస ఓటములతో మూల్యం చెల్లించుకుంది. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ గెలిస్తే.. పట్టికలో కాస్త పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడానికి కారణం రిషభ్ పంత్ అనే…
గాయాల పాలయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లను భారీ మొత్తాలు వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని ఫ్రాంఛైజీలకు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ సూచించాడు. ఆటగాళ్లకు గాయాలు కావని తాను చెప్పడం లేదని, కానీ ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను మాత్రం పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకోకూడదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. సీజన్ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి తాను మొగ్గు చూపుతాను అని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్…
IPL 2025: లక్నోపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో ప్లేఆప్స్ నుంచి లక్నో వైదొలిగింది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ప్లేఆప్స్ నుంచి నిష్క్రమించగా, ఈ జాబితాలో చెన్నై, రాజస్థాన్, కేకేఆర్, ఇప్పడు లక్నో వచ్చి చేరింది. అటు గుజరాత్,ఆర్సీబీ, పంజాబ్ ప్లేఆప్స్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. రేపు ఇరు జట్లు పోటీ పడుతుండటంతో గెలిచిన జట్టు దర్జాగా ప్లేఆప్స్ కు చేరుతుంది. ఇదిలా…
ఐపీఎల్ లీగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ప్లేఆఫ్స్ కోసం పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఈ రేసులో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఉంది. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఈ జట్టు సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. లక్నో ప్లేఆఫ్ రేసులో కొనసాగాలని భావిస్తోంది. ఈ జట్టు ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10…
రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీం ఇండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ భారత టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉండటానికి అనువైన ప్లేయర్‌లు అని అభిప్రాయపడ్డారు. వారి వయసును పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.…
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాక సమస్యలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఉన్నప్పుడే మరో కెప్టెన్ ని తయారు చేయాల్సిన గంభీర్ ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా టీమిండియా టెస్ట్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుబ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ పాత్ర పోషిస్తే,,, రిషబ్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయొచ్చు. కానీ టెస్టుల్లో పెద్దగా అనుభవం లేని…
రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాంతో త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. యువ ఆటగాడికే టెస్ట్ సారథ్యం అప్పగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య…