Rishabh Pant eye on Rohit Sharma WTC Record: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 66 ఇన్నింగ్స్‌లలో 43.17 సగటుతో 2677 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మాజీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 2716 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో పంత్ మరో…
లార్డ్స్ టెస్ట్ విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడని ప్రశంసించాడు. చివరి రోజు ఉదయం ఆర్చర్ ఎదో మాయ చేస్తాడని తాను అనుకున్నా అని, అనుకున్నట్లే రెండు వికెట్స్ పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ డేంజరస్ బ్యాటర్ అని, రెండు ఇన్నింగ్స్‌ల్లో అతడిని త్వరగా ఔట్ చేయడంతోనే విజయం సాధించామని…
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మూడో మ్యాచ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. భారత బ్యాట్స్ మెన్స్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేస్తున్నారు. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో కూడా సిక్సర్లు కొట్టడంలో మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును పంత్ క్రియేట్ చేశాడు. పంత్ తన టెస్ట్ కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు.…
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం జులై 6, 7వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీంతో ఈ సీజన్లో తాను ఎలాగైనా ఆడాలని చెప్పి తన పేరును కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. ఎందుకంటే గత సీజన్లో ఆరు జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ, ఈ సీజన్లో మరో రెండు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ఈ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది.
సూపర్ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌లో కూడా రాణిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడని, అతడు కచ్చితంగా మరిన్ని రన్స్ సాధిస్తాడన్నాడు. రాహుల్ ఒక్క శతకంతోనే ఆగిపోడని, మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని మంజ్రేకర్ తెలిపాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో జులై…
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన టీమిండియా కొత్త టెస్ట్…
Sunil Gavaskar – Rishabh Pant:ఇంగ్లాండ్ టూర్ వెళ్లిన టీం ఇండియా మొదటి టెస్ట్ లోనే రికార్డుల మోత మోగిస్తోంది. ఒకే టెస్టులో ఐదు సెంచరీలు రావడంతో 93 ఏళ్ల చరిత్రను తిరగరాసింది టీమిండియా. ఇది ఇలా ఉండగా.. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్ లలో శతకాలతో చెలరేగిన పంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో శతకాలు చేసిన వికెట్ కీపర్…
లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు రెండవ సెషన్లో కెఎల్ రాహుల్ భారత్ తరపున తన తొమ్మిదవ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ మరో ఎండ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఔటైన తర్వాత వచ్చిన రిషబ్ పంత్ 130 బంతుల్లో తన…
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా.. పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమాలిని ఉల్లంగించినట్లు తేలితే పంత్‌కు కఠిన…
Rishabh Pant: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ప్లేయర్లు బ్యాటింగ్ లో రెచ్చిపోతున్నారు. మొదటి రోజు యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీలో అదరగొట్టగా, రెండో రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో దుమ్మురేపాడు. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలతో ఇంగ్లాండ్ పై భారత్ అధిపత్యం కొనసాగిస్తోంది.