Rishabh Pant: టీమిండియాలోకి ఓ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత టీమిండియా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. నవంబర్ 14 నుంచి ఇరు జట్లు మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే టైంలో టీమిండియా స్టార్ ప్లేయర్ గురించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. గాయం నుంచి కోలుకున్న…
మూడు నెలల విరామం తర్వాత టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న నాలుగు రోజుల మొదటి మ్యాచ్‌లో పంత్ ఆడుతున్నాడు. భారత్-ఏ జట్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్.. బ్యాటింగ్ చేయకముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఇందుకు కారణం అతడు టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ ధరించడమే. దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రిషభ్ పంత్ బౌలింగ్…
గాయం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లోని మాంచెస్టర్ టెస్ట్ (నాలుగో టెస్టు)లో పంత్ పాదానికి గాయమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న బెంగళూరులోని…
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా వన్డే ప్రపంచకప్ 2027ను అక్టోబర్-నవంబర్‌లలో నిర్వహిస్తాయి. 2003 తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వే కలిసి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం ఇది రెండోసారి. ఈ టోర్నీలో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇద్దరు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ హింట్ ఇచ్చినా.. అందరికి అనుమానాలే ఉన్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు కూడా మెగా టోర్నీలో ఆడడం డౌటే అని తెలుస్తోంది. రోహిత్ శర్మ: 1987లో…
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరుగుతోంది. మంచి ఫామ్ మీదున్న భారత్ ఫైనల్ చేరడం ఖాయం. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి టెస్ట్, సెప్టెంబర్ 10-14 మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అజిత్ అగార్కర్…
Fans Slams Rishabh Pant over Instagram Subscription: ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌లోనే చికిత్స తీసుకున్న పంత్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం కారణంగా త్వరలో జరిగే ఆసియా కప్ 2025కి దూరం కానున్నాడు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్న పంత్ ఎంజాయ్ చేస్తున్నాడు. చెఫ్ అవతారం ఎత్తి పిజ్జా తయారు చేశాడు. అయితే అతడు తీసుకున్న ఒక నిర్ణయం సోషల్…
IND vs ENG: ఇంగ్లండ్- భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఇవాళ్టి నుంచి ఓవల్ స్టేడియంలో ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2–2తో సిరీస్ సమం అవుతుంది.
Rishabh Pant’s Emotional Message to Team India Before 5th Test: భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్)ల గొప్ప పోరాటంతో మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన కీపర్ రిషబ్ పంత్ క్రీజ్‌లోకి రానవసరం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కోసం గాయంతోనే బరిలోకి దిగిన పంత్.. అవసరమైతే రెండో…
మాంచెస్టర్‌లో భారత, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి టెస్ట్ జూలై 31 నుంచి లండన్ లో జరుగనుంది. కాగా ఐదో టెస్టుకు సిరీస్ హీరో పంత్ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐదవ టెస్ట్ కు దూరమయ్యాని తెలిపింది. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఎన్ జగదీశన్ ను జట్టులోకి తీసుకున్నారు. బోర్డు 5వ టెస్ట్ కు కొత్త జట్టును…
Rishabh Pant to Bat in Second Innings Despite Injury: మాంచెస్టర్‌లోని నాలుగో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాకు శుభవార్త. జట్టు కోసం గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఈ విషయాన్ని కోచ్ సితాన్షు కొటక్ పరోక్షంగా ధ్రువీకరించాడు. పంత్ తప్పకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని తాను అనుకుంటున్నా అని పేర్కొన్నాడు. కాలికి తీవ్ర గాయమైనా తొలి ఇన్నింగ్స్‌లో పంత్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు జట్టు…