Rishabh Pant eye on Rohit Sharma WTC Record: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 66 ఇన్నింగ్స్‌లలో 43.17 సగటుతో 2677 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మాజీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 2716 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో పంత్ మరో 40 పరుగులు చేస్తే రోహిత్‌ను అధిగమిస్తాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2617 పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ ఉన్నాడు. రూట్ 67 మ్యాచ్‌ల్లో 123 ఇన్నింగ్స్‌లలో 51.75 సగటుతో 5796 రన్స్ చేశాడు. రూట్‌కు తప్ప టాప్-5లో ఉన్న ఏ బ్యాట్స్‌మన్‌కు కూడా 50 కంటే ఎక్కువ సగటు లేదు. ఈ జాబితాలో స్టీవ్ స్మిత్ 4278 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. మార్నస్ లాబుషేన్ (4225), బెన్ స్టోక్స్ (3475), ట్రావిస్ హెడ్ (3300), ఉస్మాన్ ఖవాజా (3288) టాప్-5లో ఉన్నారు. బాబర్ అజామ్ (2998), జాక్ క్రౌలీ (2879), కేన్ విలియమ్సన్ (2822), ఓలీ పోప్ (2748) పరుగులు చేశారు.
Also Read: Nitish Kumar Reddy: శుభవార్త.. కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి!
మరో రికార్డుకు కూడా రిషబ్ పంత్ చేరువలో ఉన్నాడు. మరో 182 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు డెనిస్ లిండ్సే పేరిట ఉంది. 1966/67 ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల్లో 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. ఈ రికార్డుకు పంత్ 182 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో పంత్ 3 మ్యాచ్‌లలో 425 పరుగులు బాదాడు.