భారత మాజీ క్రికెటర్లు హర్జజన్ సింగ్, సురేశ్ రైనా, శ్రీశాంత్ కలిసి రిషబ్ పంత్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. రిషబ్ పంత్ తో కలిసి దిగిన ఫోటోలను సోసల్ మీడియాలో సురేశ్ రైనా పోస్ట్ చేశాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న పంత్.. మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు.
Indian Cricketers Offer Prayers At Ujjain's Mahakaleswar Temple: ఉజ్జయిన మహాకాళేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు ప్రత్యేకపూజలు చేశారు. భారత క్రికెటర్లు సోమవారం ఉదయం ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించే శివుడి భస్మహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ ధోతీని ధరించి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పూజల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ కు వచ్చింది.…
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముంబైకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది.