టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. రెండు నెలల క్రితం కారు ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ తాజాగా తన హెల్త్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. తాను వేగంగా కోలుకుంటున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటో రిలీజ్ చేశాడు. అయితే చికిత్స తర్వాత పంత్ కనిపించిన ఫస్ట్ ఫోటో ఇదే కావడం గమనార్హం. ఇందులో వాకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తున్నాడు పంత్. అతడి కుడి కాలికి బ్యాండేజ్ కనిపిస్తోంది.
Also Read: Jasprit Bumrah: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..చివరి రెండు టెస్టులకూ స్టార్ పేసర్ దూరం!
ఈ ఫోటోకు “ఒక అడుగు ముందుకు సాగడానికి.. ఒక అడుగు మానసికంగా ధృడంగా మరడానికి.. ఒక అడుగు బెటర్ లైఫ్ కోసం” అంటూ పాజిటివ్ క్యాప్షన్ ఒకటి జత చేశాడు. పంత్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. గత డిసెంబర్‌లో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వస్తోన్న క్రమంలో పంత్ కారు డివైడర్ రెయిలింగ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పంత్ తలతో పాటు కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇటీవలే పంత్‌కు ముంబైలో వైద్యులు సర్జరీ చేశారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌కు పంత్ దూరం కానున్నాడు.
One step forward
One step stronger
One step better pic.twitter.com/uMiIfd7ap5— Rishabh Pant (@RishabhPant17) February 10, 2023