ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ఆ టీం మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా స్టేడియానికి వచ్చాడు. మంచి ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ తదితరులు ప్రాక్టీస్ చేస్తుంటే పంత్ అక్కడే నిలబడి చూశారు. మధ్య మధ్యలో వారితో నవ్వుతూమాట్లాడుతూ, జోకులు వేస్తూ సందడిగా గడిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియాలో పంచుకుంది.
టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ కు పంత్ దూరమయ్యాడు. అతను లేని లోటును మరో విధంగా ( జట్టుతో పాటు డగౌట్ లో అతని నెంబర్ జర్సీ ఉన్న టీషర్ట్ ధరించేలా ) తీర్చుకోవాలని ఢిల్లీ ఫ్రాంఛైజీ భావించింది.
అందరు ఆడుతున్నారు.. నేనెందుకు ఆడకూడదు.. నేనింకా గేమ్ లోనే ఉన్నా.. ఐపీఎల్ ఆడడానికి త్వరలోనే మీ ముందుకు వస్తున్నా.. అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. దీంతో పంత్ మాటలు విన్న అభిమానులు ఆనందపడిపోయారు. కానీ అది ప్రమోషనల్ వీడియో అని తెలియగానే అందరు చల్లబడ్డారు.
భారత మాజీ క్రికెటర్లు హర్జజన్ సింగ్, సురేశ్ రైనా, శ్రీశాంత్ కలిసి రిషబ్ పంత్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. రిషబ్ పంత్ తో కలిసి దిగిన ఫోటోలను సోసల్ మీడియాలో సురేశ్ రైనా పోస్ట్ చేశాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న పంత్.. మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు.
Indian Cricketers Offer Prayers At Ujjain's Mahakaleswar Temple: ఉజ్జయిన మహాకాళేశ్వర ఆలయంలో టీమిండియా క్రికెటర్లు ప్రత్యేకపూజలు చేశారు. భారత క్రికెటర్లు సోమవారం ఉదయం ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించే శివుడి భస్మహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ ధోతీని ధరించి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పూజల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు. న్యూజిలాండ్ తో జరిగే మూడో వన్డే కోసం టీమిండియా మధ్యప్రదేశ్ కు వచ్చింది.…