Krishnamachari Srikkanth On Indian World Cup Team: వచ్చే ఏడాదిలోనే వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో.. టీమిండియాలో ఎవరెవరికి స్థానం కల్పించాలన్న విషయంపై సీనియర్లు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. షార్ట్ టర్మ్‌లో రాణించేవాళ్లు కాకుండా, లాంగ్ టర్మ్‌లో సత్తా చాటగల ఆటగాళ్లనే ఎంపిక చేయాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సైతం అలాంటి సూచనలే ఇస్తూ.. ఇద్దరికీ చోటు ఇవ్వొద్దంటూ బాంబ్ పేల్చారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? అని అనుకుంటున్నారా.. స్టార్లుగా ఎదుగుతున్న శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్. తన వరల్డ్‌కప్ జట్టులో ఆ ఇద్దరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వనంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.
IND Vs SL: సెంచరీతో సూర్యకుమార్ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ భారీ స్కోరు
శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘నా వరల్డ్‌కప్ జట్టులో శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్‌కు చోటు ఇవ్వను. రిషభ్ పంత్ అయితే ఒక గెలుపు గుర్రం. ఒంటిచేత్తోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగే సత్తా అతనికి ఉంది. పదింట మూడు మ్యాచ్‌లు గెలిపించినా సరే, నేనైతే పంత్‌కే పెద్ద పీట వేస్తాను. కీలక సమయంలో అతడు జట్టుని గెలిపిస్తాడు. ఇలాంటి ఆటగాళ్ల నుంచి నిలకడైన ప్రదర్శన కోరుకోకూడదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే.. పంత్ నిలకడగా మంచి ప్రదర్శన కనబర్చకపోయినా, అవసరమైనప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగలుగుతాడని, అలాంటి వాడు వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సిందేనని ఆయన కోరుకుంటున్నాడు. ఇక పేసర్ల విషయానికొస్తే.. బుమ్రా, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ జట్టులో ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. మహమ్మద్ షమీ సో సోగా ఆడుతాడు కాబట్టి, అతని లేకపోయినా పర్లేదని పేర్కొన్నాడు. దీపక్ హుడా కూడా జట్టులో ఉంటే, బాగుంటుందని తెలిపాడు.
Waltair Veerayya: వాల్తేరు వీరయ్యకి పోలీసులు షాక్.. ఎక్కడైనా వాలిపోతామంటున్న మెగాఫ్యాన్స్
తాను టీమిండియా అభిమానిగా ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, చీఫ్ సెలక్టర్ పదవిలో ఉన్నాననుకుని ఈ మాటలు మాట్లాడుతున్నానని శ్రీకాంత్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ కోసం 20 మందితో జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తున్న తరుణంలో.. శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు.. ఈమధ్య శిఖర్ ధావన్ స్థానంలో శుభ్మన్ గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారు. అప్పుడప్పుడు సత్తా చాటిన దాఖలాలూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అతనికి వరల్డ్‌కప్‌లో చోటు ఇవ్వొద్దని శ్రీకాంత్ పేర్కొనడం గమనార్హం.