Delhi Capitals Honors Rishabh Pant With Jersey Number: ఓ కారు ప్రమాదంలో యంగ్ క్రికెటర్ రిషభ్ పంత్ తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే! ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి రిషభ్ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతడు.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కి కూడా దూరం కానున్నాడు. అతని స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతవరకూ ఎవ్వరు చేయని ఓ పని చేసేందుకు శ్రీకారం చుట్టింది. పంత్ జెర్సీ నంబర్‌తో ఆటగాళ్లందరూ బరిలోకి దిగాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్ ఫి్స్ అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ దృవీకరించాడు.
Extramarital Affair: వివాహేతర సంబంధానికి యువకుడు బలి.. అసలు ఏమైందంటే?
‘‘ఈ ఏడాది ఐపీఎల్‌లో మేము పంత్‌ను చాలా మిస్ అవ్వబోతున్నాం. అతడు గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌లోనూ.. డగౌట్‌లో అతడు నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నాను. ఒకవేళ అది కుదరకపోతే.. మాకు సాధ్యమయ్యే మార్గాల్లో రిషభ్‌ని జట్టులో భాగం చేయాలని అనుకుంటున్నాం. అతడి అతడి జెర్సీ నంబర్‌ను మా షర్టులపై లేదా క్యాప్‌లపై ఉంచాలి నిర్ణయించాం. అతడు మా జట్టుతో లేకపోయినా.. ఎప్పటికీ అతడే మా నాయకుడని తెలియజేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. పంత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది మేమింకా నిర్ణయించలేదు. అయితే.. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం మా జట్టుతో చేరాడు’’ అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ఊహించని షాక్.. ఆ ఇద్దరు ఔట్?
ఈ ఏడాది సీజన్‌కి ముందు తాము ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడాలని అనుకుంటున్నామని రికీ పాంటింగ్ తెలియజేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ క్రీడాకారుడికి ఇలాంటి గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.