టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్న పంత్.. మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు. ఎవరి సాయం లేకుండానే పంత్ ధీమాగా నడవగలుగుతున్నాడు. గతంలో ఓ చిన్న చేతికర్రతో నడుస్తున్న వీడియో షేర్ చేసిన రిషబ్ పంత్ ఇప్పుడు.. వాట్ పూల్ లో నడిచిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. చిన్న విషయాల మధ్యలో ప్రతీదానికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు.. గాయం తర్వాత తన హెల్త్ కు సంబంధించిన అప్టేట్స్ ఇస్తున్న పంత్.. తాజాగా ఈ వీడియోను విడుదల చేసి తాను కోలుకుంటున్నాననిని చెబుతున్నాడు.
Also Read : Hyderabad Crime: భార్యని నరికి, పసికందును సంపులో వేసి.. భర్త పరార్
నెల రోజుల క్రితం పంత్ తన ఇన్ స్టా గ్రామ్ లో.. ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు బలంగా.. ఒక అడుగు మెరుగ్గా అని రాసుకొచ్చాడు. కార్ యాక్సిడెంట్ తర్వాత నాలుగు రోజుల పాటు ఉత్తరాఖండ్ లోనే చికిత్స పొందిన పంత్ కు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బీసీసీఐ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుంది. పంత్ గైర్హజరీలో బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో అతడు లేని లోటు స్పష్టంగా తెలిసిందని నెటిజన్స్ వాపోతున్నారు.
Also Read : Pune: భార్యా, కొడుకును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
నాగ్ పూర్, ఢిల్లీ, ఇండోర్ లలో టెస్టులో కూడా చాలా మంది అభిమానులు పంత్ వి మిస్ యూ అని ప్లకార్డులు పట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాపై పంత్ కు మంచి రికార్డు ఉంది. గాయం కారణంగా పంత్ ఐపీఎల్, వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ వంటి కీలక టోర్నీలు మిస్ కానున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ వరకైనా రిషబ్ పంత్ కోలుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.