ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక మ్యాచ్ కు రెడీ అవుతోంది. చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ ( ఆర్సీబీ)ని ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో బెంగళూరు చేరుకున్న ఆ జట్టుకు మంచి సర్ ప్రయిజ్ దొరికింది. ఈ జట్టు ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ఆ టీం మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా స్టేడియానికి వచ్చాడు. మంచి ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ తదితరులు ప్రాక్టీస్ చేస్తుంటే పంత్ అక్కడే నిలబడి చూశారు. మధ్య మధ్యలో వారితో నవ్వుతూమాట్లాడుతూ, జోకులు వేస్తూ సందడిగా గడిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియాలో పంచుకుంది.
Read Also : Saturday stotram: శనివారం ఈ స్తోత్రపారాయణం చేస్తే శత్రుత్వం నశించి విజయం ప్రాప్తిస్తుంది
రిషబ్ పంత్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో రికీ పాంటింగ్ కుమారుడు కూడా తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. గతేడాది చివర్ లో నూతన సంవత్సర వేడుల కోసం ఇంటికి వెళ్తుండగా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. పలు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. నడవడానికి ఇంకా కొంత ఇబ్బందిగా ఉండటంతో చేతికర్రల సాయంతో నడుస్తున్నాడీ స్టార్ క్రికెటర్. ఈ ప్రమాదం కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడటం లేదు. ఈ ఏడాది చివర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో కూడా పంత్ ఆడటం అనుమానంగా ఉంది. ఈ క్రమంలో తమ జట్టులో పంత్ చాలా కీలకమైన ఆటగాడని.. టీం ఆత్మ వంటి వాడని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా చెప్పాడు. అందుకే ఢిల్లీ ఆడిన తొలి మ్యాచ్ లో తమ డగౌట్ లో రిషబ్ పంత్ జెర్సీనీ తగలించి ఆడిందీ. కానీ డేవిడ్ వార్నర్ జిడ్డు బ్యాటింగ్ కారణంగా భారీ స్కోర్లను ఛేజ్ చేయలేక.. అలాగే ముందు బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్లు చేయలేకపోతుంది. మరి ఈ సమస్య నుంచి ఢిల్లీ బయటపడుతుందో లేదో చూడాలి…
Read Also : Kethireddy Venkatarami Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్