Yashasvi Jaiswal Creates Sensational Record In IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనింగ్ చేస్తున్న ఈ ఆటగాడు.. ఆ జట్టుకే అత్యంత కీలక ఆటగాడిగా అవతరించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతూ.. మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ఓ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో.. ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 130 రోజుల్లో 34 ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (20 ఏళ్ల 218 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగుల మార్క్ అందుకొని అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత పృథ్వీ షా(21 ఏళ్ల 169 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, సంజూ శాంసన్(21 ఏళ్ల 183 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, శుభ్మన్ గిల్(21 ఏళ్ల 222 రోజులు) 41 ఇన్నింగ్స్‌ల్లో, దేవదత్ పడిక్కల్(21 ఏళ్ల 285 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నారు.
Rakshita Suresh: ప్రముఖ సింగర్‌కి తప్పిన ప్రమాదం.. చావు అంచులదాకా వెళ్లి..

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడి గెలిచింది. చివర్లో నో బాల్ వేయడంతో.. చేజారిన ఈ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ సొంతం అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి, చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. చివర్లో సందీప్ శర్మ నో బాల్ వేయడంతో, హైదరాబాద్ జట్టుకి ఒక ఎక్స్‌ట్రా బంతితో పాటు ఫ్రీ హిట్ కలిసొచ్చింది. దాన్ని అబ్దుల్ సమద్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ.. సిక్సర్ కొట్టాడు. ఫలితంగా.. ఎస్ఆర్‌హెచ్ గెలుపొందింది.
Yuzvendra Chahal: చాహల్ సరికొత్త రికార్డ్.. ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా..