Rishabh Pant Ruled Out Of Asia Cup And ODI World Cup: గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం అతడు కర్రల సహాయంతో నడుస్తున్నాడు. తన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రదర్శనలకు కూడా అతడు హాజరయ్యాడు. అయితే.. అతడు ఏదో ఒక సహాయం లేకుండా నడవలేకపోతున్నాడు. లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ప్రకారం.. పంత్ మునుపటిలా యాక్టివ్‌గా తయారవ్వాలంటే.. ఇంకా 9 నెలల సమయం పడుతుందని తెలిసింది. అంటే.. అతని పూర్తిస్థాయి రికవరీకి వచ్చే ఏడాది జనవరి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో.. అతడు సెప్టెంబర్ నెలలో జరిగే ఆసియా కప్, అక్టోబర్ – నవంబర్‌లలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డ్
ఆ రెండు టోర్నీల్లో వరల్డ్‌కప్ అత్యంత ముఖ్యమైంది. అయితే.. ఆ మెగా టోర్నీకి అతడు అందుబాటులో ఉండడని దాదాపు తేలిపోయింది కాబట్టి.. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. సెలెక్టర్ల పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్నాయి కానీ, ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ముందు వరసలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ పేర్లు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్‌లో వీరిద్దరిలో సంజూ అద్భుతంగా రాణిస్తుంటే, ఇషాన్ కిషన్ మాత్రం ప్రతీసారి విఫలం అవుతూనే ఉన్నాడు. ఒక్క అర్థశతకం మినహాయించి, గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడలేదు. కీపింగ్ విషయంలోనూ పేలవంగా ప్రదర్శన కనబరుస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. అదే సంజూ మాత్రం.. దుమ్ముదులిపేస్తున్నాడు. కెప్టెన్‌ని జట్టుని ముందుకు నడిపించడమే కాదు.. బ్యాటర్‌గా, కీపర్‌గా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. సంజూని వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు.
Crime News: వివాహిత శ్వేత మృతి కేసులో ట్విస్ట్.. కీలకంగా మారనున్న కాల్ రికార్డింగ్స్
ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ ఇద్దరితో పాటు కేఎల్ రాహుల్, శ్రీకర్ భరత్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కీపర్‌గా కేఎల్ రాహుల్ ఓకే గానీ.. బ్యాటింగ్ పరంగానే అతడు చాలారోజుల నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఎప్పుడో ఒకసారి సత్తా చాటుతున్నాడే తప్ప, మునుపటిలా నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇక శ్రీకర్ భరత్ ఇంకా కొత్తవాడే కాబట్టి.. వరల్డ్‌కప్‌లో అతడ్ని తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే.. సంజూ, కేఎల్ రాహుల్ మధ్యే గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది. మరి.. సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.